Dhanush Kara: చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు, నా కోరిక చెప్పి ఉంటే అంతా నవ్వేవారు.. అవమానాలపై హీరో ధనుష్ కామెంట్స్
Dhanush Speech Kara Pre Release Event: హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలపై స్పందించారు. నాడు తన శరీరాకృతిని చూసి నవ్విన వారే, నేడు తన నటనకు ఫిదా అవుతున్నారని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ధనుష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర. తాజాగా చెన్నైలో కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలోని బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. ఆ సమయంలో పాత రోజులను గుర్తు చేసుకున్న ధనుష్, తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను పంచుకున్నారు.

బైక్ కోసం తపించే పాత్రలో
వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'పొల్లాదవన్'లో ధనుష్ ఒక మధ్యతరగతి యువకుడిగా, బైక్ కోసం తపించే పాత్రలో అద్భుతంగా నటించారు. "పొల్లాదవన్ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా కంటే ముందు నన్ను చూసిన వారంతా 'చాలా బక్కగా ఉన్నావు' అంటూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ సినిమాలో మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో (Six-pack) కనిపించినప్పుడు, జనం నా బాడీని చూసి చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు. నా కెరీర్‌లో అది మర్చిపోలేని అనుభూతి" అని ధనుష్ గుర్తు చేసుకున్నారు.
'యద్భావం తద్భవతి'.. నమ్మకమే గెలిపించింది
తన యువ అభిమానులకు సందేశమిస్తూ, ధనుష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లు 'యద్భావం తద్భవతి'.. మనం ఏది బలంగా కోరుకుంటామో అదే అవుతాం" అని ధనుష్ చెప్పారు.
"2002-2003 ఆ సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరికైనా చెప్పి ఉంటే అందరూ నవ్వుకునేవారు. కానీ, నా మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు నేషనల్ అవార్డ్ అందుకుంటానని బలంగా అనుకున్నాను. అనుకున్నట్లే ఆ సమయం వచ్చింది" అని ధనుష్ పేర్కొన్నారు.
నిజంగానే ఆయన పట్టుదల ఫలించింది. 2010లో 'ఆడుగళం' సినిమాకు, ఆ తర్వాత 2019లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు ధనుష్. నటుడిగానే కాకుండా నిర్మాతగా 'కాకా ముట్టై', 'విసరనై' చిత్రాలకు కూడా ఆయన జాతీయ పురస్కారాలను కైవసం చేసుకోవడం విశేషం.
పట్టపగలే బ్యాంక్ దోపిడీ.. ఏంటి ఈ 'కర' కథ?
ప్రస్తుతం ధనుష్ నటించిన 'కర' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్. పట్టపగలే బ్యాంకులను దోచుకునే ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలు పోషించారు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, తేని ఈశ్వర్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. కర ట్రైలర్‌లో ధనుష్ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


