OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్-గుహలో నగ్నంగా శవాలు, యువతి ప్రాణ పోరాటం-ఇక్కడ చూసేయండి!

Apex OTT Release Telugu: ఓటీటీలోకి తెలుగులో హాలీవుడ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అపెక్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మనుషులను వెంటాడే సీరియల్ కిల్లర్ నుంచి ఓ యువతి ప్రాణాల కోసం ఎలా పోరాటం చేసిందనేదే కథ. స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ నటించిన అపెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 25, 2026, 19:12:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Survival Action Thriller Apex In Telugu: ప్రస్తుతం వెండితెర యుగం కంటే ఓటీటీ ఎరా ఎక్కువగా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి రిలీజ్ అయి అలరిస్తోంది.

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్-గుహలో నగ్నంగా శవాలు, యువతి ప్రాణ పోరాటం-ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్-గుహలో నగ్నంగా శవాలు, యువతి ప్రాణ పోరాటం-ఇక్కడ చూసేయండి!

ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న

ఆ సినిమానే అపెక్స్. హాలీవుడ్ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అపెక్స్ అంటే తెలుగులో శిఖరం అనే అర్థం వస్తుంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. గతంలో 'మాన్‌స్టర్' సినిమాకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చార్లిజ్ థెరాన్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్', 'అటామిక్ బ్లోన్డ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చార్లిజ్ థెరాన్ ఇటీవలే ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ మూవీలోనూ మెరిశారు. ఇప్పుడు 'అపెక్స్' ద్వారా మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేస్తోంది. 'ఎవరెస్ట్' వంటి అద్భుత చిత్రాలను తీసిన బల్తాసర్ కోర్మకూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అపెక్స్ నటీనటులు

జెరెమీ రాబిన్స్ అందించిన కథను దర్శకుడు బల్తాసర్ కోర్మకూర్ అద్భుతంగా తెరకెక్కించారు. చెర్నిన్ ఎంటర్టైన్మెంట్, ఐఆర్వీకే స్టూడియోస్ వంటి ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా అపెక్స్ చిత్రాన్ని నిర్మించాయి. పీటర్ చెర్నిన్, జెన్నో టోపింగ్ వంటి హేమాహేమీలు నిర్మాతలుగా వ్యవహరించారు.

అపెక్స్ మూవీలో చార్లిజ్ థెరాన్‌తోపాటు టారోన్ ఎగర్టన్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. వీరితోపాటు ఎరిక్ బనా, క్యాటిలన్ స్టేసీ, బెస్సీ హోలాండ్, జాక్ గర్ర్‌డ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన 'అపెక్స్' ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

ప్రియుడిని కోల్పోయిన బాధ నుంచి

ప్రియుడిని కోల్పోయిన బాధలో ఉన్న సాషా అనే యువతి తనను తాను ఓదార్చుకోవడానికి ఆస్ట్రేలియాలోని దట్టమైన అడవుల్లో ఒంటరిగా ప్రయాణం మొదలుపెడుతుంది. అయితే, ఆ ప్రయాణం ఆమె ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక క్రూరమైన కిల్లర్ (టారోన్ ఎగర్టన్) ఆమెను తన వేటగా భావించి వెంబడిస్తుంటాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె చేసిన సాహసాలు, ఆ కిల్లర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టిందనేదే ఈ సినిమా ఇతివృత్తం.

మనుషులను వెంటాడి చంపే సీరియల్ కిల్లర్ దట్టమైన అడవిలోని ఓ రహస్య గుహలో వేలాడదీసి ఉంచుతాడు. ఆ రహస్య గుహలో నగ్నంగా ఎన్నో శవాలు ఉంటాయి. అదే గుహలోకి సాషాను కూడా బంధించి తీసుకొస్తాడు సీరియల్ కిల్లర్. ఆ తర్వాత ఏమైంది? సీరియల్ కిల్లర్‌తో సాషా ప్రాణ పోరాటం ఎలా? చేసిందనేది అపెక్స్‌లో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఇంతటి ఎంగేజింగ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అపెక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 24 అంటే నిన్నటి నుంచే అపెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నిన్న అపెక్స్ ఓటీటీ రిలీజ్ అయింది. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ అపెక్స్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు.

అంటే, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన రోజునే తెలుగులో కూడా వచ్చేసింది అపెక్స్ సినిమా. తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత భాషలో ఈ అపెక్స్ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేసే అవకాశం ఉండటంతో మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ఇంట్రెస్టింగ్ మూవీగా అపెక్స్ నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More