Oscars 2026 Tie: ఒకే అవార్డ్, ఇద్దరు విజేతలు- ఆస్కార్ 98 ఏళ్ల చరిత్రలో అరుదైన అద్భుతం- ఇలా జరగడం ఏడోసారి మాత్రమే!

Oscars 2026 Tie Seventh Time In 98 Years: ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో అత్యంత అరుదైన అద్భుతం ఈ ఏడాది కూడా చోటుచేసుకుంది. బెస్ట్ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ఒకే అవార్డుకు ఇద్దరు విజేతలు నిలవడంతో అటు ప్రేక్షకులు, ఇటు విన్నర్స్ ఆశ్చర్యపోయారు. 98 ఏళ్ల ఆస్కార్ ప్రస్థానంలో ఇలా జరగడం ఏడోసారి మాత్రమే.

Published on: Mar 16, 2026, 15:30:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అకాడమీ అవార్డుల 98 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు 2000కు పైగా అవార్డులను ప్రదానం చేశారు. అయితే, ఒకే కేటగిరీలో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చి, అవార్డును పంచుకోవడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే 'ఆస్కార్ 2026' వేదికపై పునరావృతమైంది.

ఒకే అవార్డ్, ఇద్దరు విజేతలు- ఆస్కార్ 98 ఏళ్ల చరిత్రలో అరుదైన అద్భుతం- ఇలా జరగడం ఏడోసారి మాత్రమే!
ఒకే అవార్డ్, ఇద్దరు విజేతలు- ఆస్కార్ 98 ఏళ్ల చరిత్రలో అరుదైన అద్భుతం- ఇలా జరగడం ఏడోసారి మాత్రమే!

ఇలా కూడా జరుగుతుందా

ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని స్టేజ్ పైకి వచ్చి "ఇది టై అయింది" అని ప్రకటించగానే హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అసలు ఆస్కార్‌లో ఇలా కూడా జరుగుతుందా అని చాలా మంది సందేహంలో మునిగిపోయారు.

కుమాయిల్ నంజియాని క్లారిటీ

బెస్ట్ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో విజేతను ప్రకటించేందుకు వచ్చిన నటుడు కుమాయిల్ నంజియాని, ఫలితం చూసి తనే షాక్ అయ్యారు. "ఇది టై! నేను జోక్ చేయడం లేదు.. నిజంగానే ఇద్దరు విజేతలు ఉన్నారు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి, మనం దీన్ని పూర్తి చేద్దాం" అంటూ పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా ఒక విజేత పేరు ప్రకటించి, వారు అవార్డు తీసుకున్న తర్వాత రెండో విజేతను పిలుస్తానని వివరించారు.

రెండు చిత్రాలు సంయుక్తంగా

ఈ ఏడాది ‘ది సింగర్స్’ (The Singers), ‘టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సెలైవా’ (Two People Exchanging Saliva) చిత్రాలు సంయుక్తంగా బెస్ట్ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్నాయి. స్టేజ్ పైకి వచ్చిన దర్శకులు కూడా "ఆస్కార్‌లో టై అయ్యే అవకాశం ఉంటుందని మాకు తెలియదు" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గతంలో ఆరు సార్లు..

ఆస్కార్ చరిత్రను తిరగేస్తే 1932లో మొదటిసారి ఇలాంటి 'టై' నమోదైంది. అప్పట్లో ఉత్తమ నటుడు కేటగిరీలో వాలెస్ బీరీ, ఫ్రెడరిక్ మార్చ్ ఇద్దరూ అవార్డును పంచుకున్నారు.

ఆ తర్వాత:

1950: బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో.

1987: బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో.

1995: ఇదే షార్ట్ ఫిలిం కేటగిరీలో అప్పట్లో ఒకసారి టై అయింది.

2013: 'స్కైఫాల్', 'జీరో డార్క్ థర్టీ' చిత్రాలు బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ అవార్డును పంచుకున్నాయి.

చరిత్రలో నిలిచిపోయే టై

అయితే వీటన్నింటికంటే 1969లో జరిగిన ‘టై’ ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. అప్పట్లో లెజెండరీ నటీమణులు క్యాథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్ ఇద్దరూ 'ఉత్తమ నటి'గా నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇన్నాళ్లకు 2026 ఆస్కార్ వేదికపై అలాంటి అరుదైన ఘట్టం ఏడోసారి చోటుచేసుకోవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More