Alia Bhatt Birthday: అలియా భట్ బర్త్‌డే స్పెషల్.. నేషనల్ అవార్డ్ విన్నర్ టాప్-5 సినిమాలు ఇవే.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

Alia Bhatt Birthday: అందం ప్లస్ అభినయం కలిగిన హీరోయిన్ అలియా భట్. ఇవాళ ఆమె బర్త్ డే. నేషనల్ అవార్డు అందుకున్న అలియా కెరీర్ లోని టాప్-5 సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి. 

Mar 15, 2026, 07:24:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రతో తెలుగు వాళ్లను అలరించిన అలియా భట్ బర్త్ డే ఈ రోజు (మార్చి 15). బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోన్న ఈ భామ తన సినీ కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ సాగిపోతోంది. నేషనల్ అవార్డు అందుకున్న అలియా భట్ కెరీర్ లో టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

అలియా భట్ (x/aliaa08)
అలియా భట్ (x/aliaa08)

గంగూబాయి కతియావాడి

అలియా భట్ సినిమా కెరీర్ చెప్పుకోవాలంటే ముందు ‘గంగుబాయి కతియావాడి’ గురించి చెప్పుకోవాల్సిందే. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గంగుబాయిగా అలియా భట్ యాక్టింగ్ వేరే లెవల్. బ్రోతల్ హౌస్ లోకి వచ్చి పడ్డ తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని గంగుబాయి తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగిందనేది ఈ మూవీలో చూపించారు.

2022లో రిలీజైన గుంగూబాయి కతియావాడి సినిమాలో యాక్టింగ్ కు గాను అలియా భట్ నేషనల్ అవార్డు అందుకుంది. ఈ మూవీని పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

రాజీ

దేశభక్తి నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ రాజీ. ఇందులో అలియా భట్ టైటిల్ రోల్ ప్లే చేసింది. 1971 ఇండో-పాక్ వార్ సమయంలో పాకిస్థాన్ కు గూఢచారిగా వెళ్లేందుకు పాక్ ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకునే కశ్మీరి అమ్మాయిగా ఈ సినిమాలో అలియా నటించింది. 2018లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రాజీ సినిమాను ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

హైవే

2014లో రిలీజైన హైవే మూవీలోనూ అలియా భట్ అదరగొట్టింది. పెళ్లికి ముందు కిడ్నాప్ కు గురైన యువతిగా అలియా నటించింది. ఆ తర్వాత ఫ్రీడమ్, కిడ్నాపర్ తో ఏర్పడే సంబంధం నేపథ్యంలో అలియా యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కూడా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

డియర్ జిందగీ

మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి చెప్పే మూవీ డియర్ జిందగీ. ఇందులో కైరా అనే సినిమాటోగ్రఫర్ గా అలియా నటించింది. 2016లో థియేటర్లకు వచ్చిన ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఆర్ఆర్ఆర్

అలియా భట్ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో రామ్ చరణ్ ప్రేయసి సీతగా అలియా నటించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ జీ5, నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More