Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఆరోజే

నెట్‌ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ కోర్టు రూమ్ కామెడీ వెబ్ సిరీస్ (Netflix Web Series) 'మామ్లా లీగల్ హై' (Maamla Legal Hai) రెండో సీజన్‌తో తిరిగి వస్తోంది. రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈసారి కుశా కపిల, నిరహువా వంటి కొత్త నటులు కూడా ఇందులో చేరారు.

Published on: Mar 5, 2026, 20:05:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ తన మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను తీసుకొస్తోంది. ఢిల్లీలోని పట్పర్‌గంజ్ జిల్లా కోర్టులో జరిగే వింతైన కేసులు, అక్కడి లాయర్ల హడావిడిని నవ్వులు పూయించేలా చూపించిన 'మామ్లా లీగల్ హై' మొదటి సీజన్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సీజన్ 2 సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేస్తూ విడుదల తేదీని ప్రకటించింది.

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఆరోజే
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఆరోజే

ఏప్రిల్ 3న విచారణ మొదలు

నెట్‌ఫ్లిక్స్ తన కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై రెండో సీజన్ ప్రమోషన్లను ఆసక్తికరంగా చేపడుతోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీ వీధుల్లో కొంతమంది వ్యక్తులు కోతి వేషధారణలో వీపుపై '3rd April' అని రాసి తిరుగుతూ కనిపించారు.

ఇది దేని గురించి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. తాజాగా విడుదలైన టీజర్‌తో ఆ మిస్టరీ వీడింది. అది 'మామ్లా లీగల్ హై' సీజన్ 2 ప్రచారంలో భాగమేనని, ఏప్రిల్ 3న ఈ సిరీస్ విడుదల కాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు.

ఈ సీజన్‌లో ఏం చూడబోతున్నాం?

రెండో సీజన్‌లో పట్పర్‌గంజ్ కోర్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లాయర్ వి.డి. త్యాగి (రవి కిషన్) ఈసారి లాయర్ కోటు వదిలేసి జడ్జి కుర్చీ ఎక్కాలని కలలు కంటున్నారు. అయితే జడ్జిగా మారడం అనుకున్నంత సులభం కాదని అతనికి త్వరలోనే అర్థమవుతుంది. మునుపటి లాగే ఈసారి కూడా "నిజ జీవితంలో జరిగిన వింత సంఘటనల ఆధారంగా" క్రేజీ కేసులు, వింతైన క్లయింట్ల చుట్టూ కథ సాగుతుంది.

రవి కిషన్ ఏమన్నారంటే?

"త్యాగి ఈ సీజన్‌లో తనను తాను జడ్జిగా నిరూపించుకోవడానికి ఆరాటపడుతుంటాడు. ఇక్కడి ప్రతి కేసు సీరియస్ అయినప్పటికీ, మా లాయర్ల అప్రోచ్ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. పట్పర్‌గంజ్ కోర్టులోని ఈ పిచ్చితనాన్ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రవి కిషన్ పేర్కొన్నాడు.

నైలా గ్రెవాల్ (అనన్య ష్రాఫ్), నిధి బిష్ట్ (సుజాత నేగి), అనంత్ వి. జోషి మళ్ళీ తమ పాత్రల్లో అలరించనుండగా.. కొత్తగా కుశా కపిల, దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) జాయిన్ అవ్వడం సిరీస్‌పై అంచనాలను పెంచింది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ను చూసి ఎంజాయ్ చేసిన వాళ్లు ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న రెండో సీజన్ కోసం సిద్ధంగా ఉండండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More