ఈ సినిమాతో రష్మికకు నేషనల్ అవార్డు గ్యారెంటీ.. తక్కువ రేటింగ్ ఇవ్వలేరు.. ఆమె ఉంటే డ్యాన్స్ చేసేవాడిని: అల్లు అరవింద్
అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రెస్ మీట్ లో భాగంగా అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రష్మిక మందన్నాకు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పడం విశేషం.
రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ శుక్రవారం (నవంబర్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 5) మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీ, రష్మిక, ఇతర అంశాలపైనా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రష్మికకు నేషనల్ అవార్డు గ్యారెంటీ
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక నటనకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని అల్లు అరవింద్ అనడం విశేషం. తమ బ్యానర్ తో రష్మికకు మంచి అనుబంధం ఉందని చెప్పిన అరవింద్.. ఈ సినిమాకు ఆమె నేషనల్ అవార్డు అందుకుంటుందని, ఆ సెర్మనీకి తాను కూడా వెళ్తానని చెప్పాడు.
తక్కువ రేటింగ్ ఇవ్వలేరు
ఇక ఈ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని అతడు ఆకాశానికెత్తాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని అన్నాడు. సాధారణంగా మీడియా వాళ్లు 1.5 నుంచి 3.5 రేటింగ్ ఇస్తారని, కానీ ఈ సినిమాకు మాత్రం తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని అరవింద్ స్పష్టం చేశాడు.
కోట్లు సంపాదించాను.. తృప్తి మిగిలింది
ఇక ఎన్నో ఏళ్లుగా గీతా ఆర్ట్స్ కింద సినిమాలు నిర్మించి ఎన్నో కోట్లు సంపాదించానని, అయితే ఈ ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో మాత్రం డబ్బు కంటే తృప్తి తనకు మిగులుందని అతడు చెప్పాడు. “చాలా సినిమాలు తీశాను, తీస్తున్నాను. చాాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తుంటాయి.
మీకూ తెలుసు నేను సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించానని. ఇందులో దాపరికం ఏమీ లేదు. కానీ ఈ సినిమా తీసినందుకు నాకు డబ్బు కంటే ఎక్కువగా తృప్తి లభించింది” అని అల్లు అరవింద్ అన్నాడు. ఇక బండ్ల గణేష్ తనపై చేసిన విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు తనకు ఓ స్థాయి ఉందని, దీనికి సమాధానం చెప్పనని అతడు అన్నాడు.
రష్మిక ఉంటే డ్యాన్స్ చేసేవాడిని..
ఇక ఇదే ప్రెస్ మీట్ లో అరవింద్ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశాడు. మీరు ప్రమోషన్లలో ఉన్నారంటే దానిని ఏదో రకంగా వైరల్ చేస్తారు.. కానీ ఈ ప్రమోషన్లలో మాత్రం మీ డ్యాన్స్ మేము మిస్ అవుతున్నాము అని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. రష్మిక ఉంటే చేసేవాడిని అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఇక అల్లు అర్జున్ సరైనోడు 2 వస్తుందన్న పుకార్లు వస్తున్నాయి.. మరి ఆ సినిమాను మీ బ్యానర్లోనే తీస్తారా అని అడిగినప్పుడు.. సరైనోడు 2 వస్తే మాత్రం అది కచ్చితంగా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే వస్తుంది అని అరవింద్ స్పష్టం చేశాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


