రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు.. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పిలుద్దాం: అల్లు అరవింద్ వైరల్ కామెంట్లు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ మూవీ ట్రైలర్ ఈవెంట్లో అరవింద్ ఏమన్నారో ఇక్కడ చూసేయండి. 

Published on: Oct 25, 2025, 18:41:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఏడాది ఇప్పటికే ఆమె హీరోయిన్ గా నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక అయిదోది ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ కూడా 2025లోనే రిలీజ్ కానుంది. ఇవాళ (అక్టోబర్ 25) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మిక మందన్న గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అల్లు అరవింద్, రష్మిక మందన్న (x/GeethaArts)
అల్లు అరవింద్, రష్మిక మందన్న (x/GeethaArts)

రష్మిక లాంటి కూతురు

ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రష్మిక మందన్న లాంటి కూతురు ఉంటే బాగుండేదని అన్నారు. ‘‘ఈ కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ను మోయగలిగే కెపాసిటీ మన రష్మికకే ఉంది. ఎంతో బాగా చేసింది. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా ఏమి ఆశ్చర్యం లేదు. అంత బాగా చేసింది. నాకు తనని చూస్తే ఇలాంటి కూతురు ఉంటే బాగుండని అనిపిస్తోంది. నాకు కూతుర్లే లేరు గనుక కావాలని అనిపిస్తుంది’’ అని అరవింద్ అన్నారు.

ప్రీ రిలీజ్ కు విజయ్

రీసెంట్ గా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను తీసుకొద్దామని అల్లు అరవింద్ అన్నారు.

‘‘ఈ సినిమా గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం. అలాగే ఈ వేడుకకు విజయ్ దేవరకొండను గెస్ట్ గా పిలుద్దాం. మనం పిలిస్తే వస్తాడు కదా’’ అని అరవింద్ పేర్కొన్నారు.

వెబ్ సిరీస్ గా

‘‘నాకు 2021లో రాహుల్ రవీంద్రన్ ‘ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌’ కథ చెప్పారు. కానీ అప్పుడు ఆహా ఓటీటీ కోసం వెబ్ సిరీస్ గా దీన్ని వినిపించారు. దీన్ని సినిమాగా చేస్తే బాగుండని నాకు అనిపించింది. ఆయన ఎప్పుడు కనిపించినా ‘ఆ కథ ఏం చేశావ్? చాలా మంచి కథ. అది సినిమాగా వస్తే బాగుండు’ అనే అనేవాణ్ని’’ అని అరవింద్ చెప్పారు.

రొమాంటిక్ డ్రామా

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ‘ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌’ మూవీని రొమాంటిక్ డ్రామా గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ తదితరులు నటించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అరవింద్ కు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ముగ్గురు కొడుకులే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More