OTT: ఓటీటీలోకి వచ్చిన 1500 కోట్ల సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- ధనుష్ మెచ్చిన మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్-7.3 రేటింగ్!

OTT Science Fiction Horror Thriller Release Telugu: ఓటీటీలోకి రూ. 1500 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించిన సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ధనుష్ మెచ్చిన ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Feb 14, 2026, 08:54:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సైన్స్‌ ఫిక్షన్‌ హారర్ జోనర్ చరిత్రలో అత్యంత భయంకరమైన పాత్రలలో ఒకటి ‘ప్రిడేటర్’. ఈ మూవీ ఫ్రాంచైజీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.

ఓటీటీలోకి వచ్చిన 1500 కోట్ల సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- ధనుష్ మెచ్చిన మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్-7.3 రేటింగ్!
ఓటీటీలోకి వచ్చిన 1500 కోట్ల సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- ధనుష్ మెచ్చిన మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్-7.3 రేటింగ్!

హారర్, సైన్స్ ఫిక్షన్ ప్రియులను

ప్రపంచవ్యాప్తంగా హారర్, సైన్స్ ఫిక్షన్ ప్రియులను దశాబ్దాలుగా అలరిస్తున్న ఈ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రమే ‘ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్’ (Predator: Badlands). గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

భారీ బడ్జెట్

ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ‘బాడ్‌ల్యాండ్స్’ నిలిచింది. సుమారు 105 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 870 కోట్లు) భారీ వ్యయంతో వార్నర్ బ్రదర్స్, 20th సెంచరీ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

రికార్డు వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమా 185 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ. 1,550 కోట్లు) పైగా వసూళ్లను రాబట్టి, ఈ మూవీ సిరీస్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఫిదా అయిన ధనుష్

ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ విడుదల సమయంలో ఈ సినిమాపై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన వెంటనే తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "ప్రిడేటర్ - బాడ్‌ల్యాండ్స్.. వావ్, జస్ట్ వావ్ ఏ మార్వెల్.. ఈ ఫ్రాంచైజీని ఇష్టపడే ఒరిజినల్ ఫ్యాన్స్‌కు ఇదొక ఓజీ లాంటి కానుక" అంటూ ధనుష్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

రేటింగ్

ధనుష్ వంటి టాలెంటెడ్ హీరో స్వయంగా ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ సినిమాను మెచ్చుకోవడంతో భారతీయ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 7.3 రేటింగ్ కూడా ఉంది. అలాగే, 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని కితాబు వచ్చింది.

ఓటీటీ స్ట్రీమింగ్

ఇంతటి క్రేజ్ ఉన్న ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ హాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కింది. అలాంటి ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 12 నుంచే జియో హాట్‌స్టార్‌లో ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నాలుగు భాషల్లో

ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో ప్రిడేటర్ బా‌డ్‌ల్యాండ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఎల్లే ఫానింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్ దర్శకత్వం వహించారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఎప్పుడు మనుషులను వేటాడే వింత జీవి ప్రిడేటర్ యౌట్జా, హ్యూమనాయిడ్ రోబో కలిసి చేసే పోరాటం కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుంది. హారర్, యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ వంటి అంశాలు ఇష్టపడే వారు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ప్రిడేటర్ బాడ్‌ల్యాండ్స్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More