Heroine Mistakes: అలాంటి పాత్రలు చేసి తప్పు చేశా, ఆశ చావక చేసిన పొరపాటు అది- 200 కోట్ల సినిమాపై భూమి పెడ్నేకర్ కామెంట్స్
Bhumi Pednekar Admitted Mistakes In Career: నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్‌లో తాను చేసిన కొన్ని పొరపాట్లను బహిరంగంగా అంగీకరించారు. కేవలం కమర్షియల్ హిట్ కోసమే కొన్ని పాత్రలు చేశానని భూమి ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో 'దమ్ లగా కే హైషా', 'సాండ్ కీ ఆంఖ్', 'బధాయ్ దో' వంటి చిత్రాలతో పవర్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. సాధారణంగా సెలబ్రిటీలు తమ కెరీర్‌లో చేసిన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడరు.

పొరపాట్లు జరిగాయని
కానీ, భూమి పెడ్నేకర్ మాత్రం అందుకు భిన్నంగా, తాను చేసిన కొన్ని సినిమాల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయని నిజాయితీగా అంగీకరించారు. ఇటీవల జరిగిన ‘వి ది ఉమెన్’ (We the Women) కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు.
రూ. 200 కోట్ల హిట్ కోసం ఆశపడి
కెరీర్‌లో మీరు చేసిన ఎంపికల్లో తప్పుగా అనిపించినవి ఏవైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ చాలా సూటిగా సమాధానమిచ్చారు.
"అవును, నేను కొన్ని తప్పులు చేశాను. నా కెరీర్ ఆరంభం నుంచి మహిళా సాధికారత ఉన్న, బలమైన పాత్రలనే ఎంచుకుంటూ వచ్చాను. కానీ, మధ్యలో కొన్నిసార్లు పక్కదారి పట్టాను. ఏదో ఒక సినిమాతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరాలనే టెంప్టేషన్ (ఆశ) కలగడమే దానికి కారణం. ఆ క్రమంలో నా పాత్రకున్న ప్రాధాన్యతను తగ్గించుకున్నాను. అది నేను చేసిన అతిపెద్ద పొరపాటు" అని భూమి పెడ్నేకర్ వివరించారు.
ఆ విషయంలో అస్సలు రాజీ పడను!
కమర్షియల్ విజయాల కోసం ఆశపడినా, కొన్ని విషయాల్లో మాత్రం తాను ఎప్పుడూ రాజీ పడనని భూమి స్పష్టం చేశారు. "నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) కించపరిచేలా లేదా గౌరవం లేని పాత్రలను నేను ఎప్పటికీ చేయను" అని భూమి పెడ్నేకర్ తెలిపారు.
ఆ నమ్మకాన్ని కష్టపడి నిలబెట్టుకున్నా
"నా నుంచి ప్రేక్షకులు కేవలం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఆశిస్తారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మధ్యలో ఆ స్థానాన్ని కొంత పలచన చేశాను (Diluted), కానీ అలాంటి తప్పును మళ్లీ ఎప్పటికీ చేయను" అని భూమి పెడ్నేకర్ గట్టిగా చెప్పారు.
గోప్యంగా సినిమా పేరు
అయితే, తాను ఏ సినిమాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం భూమి పెడ్నేకర్ వెల్లడించలేదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సినిమా పేరును గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.
ఓటీటీ సిరీస్ దల్‌దల్
ఆయుష్మాన్ ఖురానా సరసన నటించిన 'దమ్ లగా కే హైషా'తో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన భూమి పెడ్నేకర్ ఇటీవల ఓటీటీ సిరీస్ 'దల్‌దల్' (Daldal) తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన ముద్ర వేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
విష్ ధమీజా రాసిన 'భెండి బజార్' పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ జనవరి 30న అమెజాన్ ప్రైమ్‌లో దల్‌దల్ ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ ఓటీటీ సిరీస్‌లో భూమితో పాటు సమర తిజోరి, ఆదిత్య రావల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


