45 కోట్ల సినిమాకు కేవలం 1 లక్ష కలెక్షన్స్- ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ దారుణాలను బయటపెట్టిన హీరోయిన్ భూమి

బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్‌లోనే ఎదురైన అతిపెద్ద పరాజయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం లక్ష రూపాయలు కూడా వసూలు చేయకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ వివరించారు.

Published on: Feb 14, 2026, 06:06:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఎట్టకేలకు ‘ది లేడీ కిల్లర్’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలపై స్పందించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచిన ది లేడీ కిల్లర్ సినిమా వైఫల్యం తనను మానసికంగా ఎంతో కృంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాను ఒప్పుకున్న కథకు, థియేటర్లలో విడుదలైన సినిమాకు అస్సలు సంబంధం లేదని భూమి పెడ్నేకర్ కుండబద్దలు కొట్టారు.

45 కోట్ల సినిమాకు కేవలం 1 లక్ష కలెక్షన్స్- ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ దారుణాలను బయటపెట్టిన హీరోయిన్ భూమి
45 కోట్ల సినిమాకు కేవలం 1 లక్ష కలెక్షన్స్- ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ దారుణాలను బయటపెట్టిన హీరోయిన్ భూమి

అసలు ఏం జరిగింది?

మిడ్-డేతో (Mid-Day) జరిపిన తాజా సంభాషణలో భూమి పెడ్నేకర్ ది లేడీ కిల్లర్ మూవీ సమయంలో జరిగిన దారుణాలను బయటపెట్టారు. "మేము చదివిన స్క్రిప్ట్ పూర్తయింది. కానీ, షూటింగ్ విషయానికి వస్తే 35 శాతం సినిమాను అసలు చిత్రీకరించనే లేదు. విడుదలైన వెర్షన్ ఒక అసంపూర్ణ చిత్రం (Incomplete film). నా కెరీర్‌లోనే ఇది అత్యంత బాధాకరమైన దశ. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్‌కు గురయ్యాను" అని భూమి పెడ్నేకర్ పేర్కొన్నారు.

అసంపూర్ణంగా ఉన్న సినిమాను నిర్మాతలు విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని భూమి పెడ్నేకర్ తెలిపారు. ఆ సమయంలో పరిశ్రమ ఇంకా కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేదని, ఆ గందరగోళంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా ఇలా తయారైందని ఆమె అభిప్రాయపడ్డారు.

బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం

అజయ్ బహల్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన ది లేడీ కిల్లర్ చిత్రం 2023లో విడుదలైంది. రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, మొదటి రోజు కేవలం 60 వేల రూపాయలు మాత్రమే వసూలు చేసి అందరినీ విస్తుపోయేలా చేసింది.

వారం రోజులు గడిచినా ది లేడీ కిల్లర్ మొత్తం వసూళ్లు లక్ష రూపాయలు కూడా దాటలేదు. ఓటీటీ సంస్థలు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో, చివరికి ఈ సినిమాను యూట్యూబ్‌లో ఉచితంగా విడుదల చేశారు.

ఒప్పుకున్న డైరెక్టర్

దర్శకుడు అజయ్ బహల్ కూడా గతంలో ఒక యూట్యూబ్ కామెంట్ ద్వారా తన సినిమా అసంపూర్ణంగా ఉందని ఒప్పుకున్నారు. సినిమాలోని సన్నివేశాల మధ్య సంబంధం లేకపోవడానికి, పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోవడానికి కారణం ఇదేనని ఆయన తెలిపారు. అయితే తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుత ప్రాజెక్టులు

ఈ చేదు అనుభవం నుంచి కోలుకున్న భూమి పెడ్నేకర్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అలరించారు. ఇటీవలే 'దల్‌దల్' (Daldal) అనే ఓటీటీ వెబ్ సిరీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు భూమి పెడ్నేకర్.

ఓటీటీ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో దల్‌దల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో భూమి పెడ్నేకర్ డీసీపీ రీటా ఫెరీరాగా శక్తివంతమైన పాత్రను పోషించారు. ఒక సీరియల్ కిల్లర్‌ను వేటాడే పోలీస్ ఆఫీసర్‌గా భూమి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More