Nani Dance Copy: కాపీ వివాదంలో నాని ది ప్యారడైజ్- ఆయా షేర్ సాంగ్ డ్యాన్స్ తనదేనంటూ కొరియోగ్రాఫర్ బాబా ఆరోపణలు!
Nani Paradise Aaya Sher Hook Step Copy Controversy: నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ది ప్యారడైజ్ సినిమాలోని ‘ఆయా షేర్’ సాంగ్ హుక్ స్టెప్పు ఇప్పుడు వివాదానికి దారితీసింది. తన డ్యాన్స్ మూమెంట్స్‌ను కాపీ కొట్టారంటూ ప్రముఖ డ్యాన్సర్ బాబా జాక్సన్ సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు.
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise). నాని పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ సినిమా నుంచి ‘ఆయా షేర్’ వంటి ఊర మాస్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

నాని మాస్ స్టెప్పులు
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది పారడైజ్ సినిమాలో నాని మాస్ స్టెప్పులు చూసి అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ఈ పాట కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆయా షేర్ పాటలోని వైరల్ హుక్ స్టెప్పు తనదేనని, దానిని కాపీ చేశారని ప్రముఖ డ్యాన్సర్ బాబా జాక్సన్ ఆరోపిస్తున్నారు.
ఆధారాలతో సహా బాబా జాక్సన్ పోస్ట్
'రొమేనియాస్ గాట్ టాలెంట్' వంటి అంతర్జాతీయ వేదికలపై తన డ్యాన్స్‌తో మెప్పించిన బాబా జాక్సన్ (యువరాజ్ సింగ్), తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.
ఇది నా ప్రతిభ
2024లో తాను ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వేసిన ఒక సంక్లిష్టమైన స్టెప్పును, ఇప్పుడు నాని వేసిన స్టెప్పును పక్కపక్కన పెట్టి ఇది ముమ్మాటికీ ‘కాపీ’ అని పేర్కొన్నారు. "జల్వా హై హమారా" (ఇది నా ప్రతిభ) అంటూ బాబా జాక్సన్ ఘాటుగా స్పందించారు.
మరింత అప్‌గ్రేడ్ చేస్తా
దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ "నీ డ్యాన్స్ అంతా మైఖేల్ జాక్సన్ నుంచి కాపీ చేసిందే కదా" అని విమర్శించగా, బాబా జాక్సన్ తనదైన శైలిలో బదులిచ్చారు. "నేను కాపీ చేయను.. ఉన్నదానిని మరింత అప్‌గ్రేడ్ చేస్తాను" అని బాబా జాక్సన్ స్పష్టం చేశారు. బాబా జాక్సన్ ప్రతిభను గతంలో అంతర్జాతీయ రాపర్ స్నూప్ డాగ్ సైతం మెచ్చుకోవడం విశేషం.
అనిరుధ్ మ్యూజిక్.. సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీ
ఇదిలా ఉంటే, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఆయా షేర్ పాటకు సుధాన్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాధారణంగా నాని సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ, ఈ సినిమాలో నాని ఒక స్లమ్ ఏరియాలో విందు ఇచ్చిన తర్వాత వేసే ఈ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
సాంగ్ రిలీజ్ అయి కొద్దీ క్షణాల్లోనే ఆయా షేర్ హుక్ స్టెప్ డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు కాపీ వివాదం రావడంతో ఆ స్టెప్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది 'పీక్ నాని' అని పొగుడుతుంటే, మరికొందరు "ఇది మాస్ స్టెప్పా లేక కామెడీనా?" అని పెదవి విరుస్తున్నారు.
కాపీ కాంట్రవర్సీపై మీమ్స్
అలాగే, కాపీ కాంట్రవర్సీపై మీమ్స్ కూడా వేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే, కాసార్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఆయా షేర్ పాటను అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఆలపించారు. ఇక భారీ అంచనాలున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కాపీ ఆరోపణలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


