Aaya Sher Song: డ్యాన్స్ ఇరగదీసిన నాని.. ది పారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్.. నెక్ట్స్ లెవెల్

నాని నటిస్తున్న ది పారడైజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ (Aaya Sher) సాంగ్ వచ్చేసింది. ప్రోమోతోనే అంచనాలు పెంచేయగా.. తాజాగా వచ్చిన ఫుల్ సాంగ్ నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా నాని డ్యాన్స్ ఇరగదీశాడు.

Published on: Feb 24, 2026, 21:53:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేచురల్ స్టార్ నాని త్వరలో 'ది ప్యారడైజ్' (The Paradise) అనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ మ్యూజిక్, నాని రా, రస్టిక్ లుక్, డ్యాన్స్ అదిరిపోయాయి.

Aaya Sher Song: డ్యాన్స్ ఇరగదీసిన నాని.. ది పారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్.. నెక్ట్స్ లెవెల్
Aaya Sher Song: డ్యాన్స్ ఇరగదీసిన నాని.. ది పారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్.. నెక్ట్స్ లెవెల్

అంచనాలను దాటేసిన ఫుల్ సాంగ్

కేవలం నాని అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం నుంచి ఆయా షేర్ పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ ఈ పూర్తి పాటను లాంచ్ చేశారు.

విడుదలైన వెంటనే ఈ పాట ప్రేక్షకుల అంచనాలను భారీ స్థాయిలో అధిగమించి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఓ అణగారిన వర్గం, అందులో నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఓ యువకుడి కథను ఈ పాట ద్వారా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు.

నాని డ్యాన్స్ అదుర్స్

ది పారడైజ్ మూవీ నుంచి వచ్చిన ఆయా షేర్ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో చూసిన తర్వాత ప్రధానంగా రెండు విషయాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటను చిత్రీకరించిన విధానం చాలా భారీగా ఉంది. ఇది కచ్చితంగా థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను ఇవ్వనుంది.

ఇక ఇందులో నాని వేసిన డ్యాన్స్ మూవ్స్ అదిరిపోయాయి. సిగార్‌ను వెలిగిస్తూ, నేలపై కూర్చుని ముందుకు కదిలే నాని డ్యాన్స్ స్టెప్ చాలా అద్భుతంగా, కొత్తగా ఉంది. ఈ పాటలో నాని ఎనర్జీ లెవెల్స్, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నానిని ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత మాస్ అవతార్‌లో ఎవరూ చూపించలేదు.

ది పారడైజ్ మూవీ విశేషాలు

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన ప్రతిభతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం అత్యద్భుతంగా ఉంది. ఈ పవర్‌ఫుల్ పాటను అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ రవిచందర్ కలిసి ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ కుమార్ రాసిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ కలిసి పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ పాటతో మూవీపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి.

ఈ సినిమాలో కయదు లోహర్ (Kayadu Lohar) ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More