Twins: కవల పిల్లలకు జన్మనిచ్చిన మనసు పలికే మౌన గీతం సీరియల్ హీరోయిన్- పెళ్లయిన పదేళ్లకు తల్లిగా ప్రమోషన్- డబుల్ ధామాకా!

Divyanka Tripathi Blessed With Twins: మనసు పలికే మౌన గీతం సీరియల్‌తో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న దివ్యాంక త్రిపాఠి ఎట్టకేలకు తల్లిగా ప్రమోషన్ అందుకున్నారు. పెళ్లయిన పదేళ్లకు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ ఆనందాన్ని ఆమె భర్త దేవుడు డబుల్ ట్రీట్ ఇచ్చాడని చెప్పడం అందరి హృదయాలను హత్తుకుంటోంది.

Published on: May 26, 2026, 13:17:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Divyanka Tripathi Blessed With Twins: ఇప్పుడంటే ఇతర భాష సీరియల్స్‌ను రీమేక్ చేసి తెలుగు తెరపై ప్రసారం చేస్తున్నారు. కానీ, గతంలో వాటిని నేరుగా డబ్బింగ్ చేసి తెలుగు టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేసేవాళ్లు. అలా తెలుగు డబ్బింగ్ సీరియల్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర హీరోయిన్ దివ్యాంక త్రిపాఠి.

కవల పిల్లలకు జన్మనిచ్చిన మనసు పలికే మౌన గీతం సీరియల్ హీరోయిన్- పెళ్లయిన పదేళ్లకు తల్లిగా ప్రమోషన్- డబుల్ ధామాకా!
కవల పిల్లలకు జన్మనిచ్చిన మనసు పలికే మౌన గీతం సీరియల్ హీరోయిన్- పెళ్లయిన పదేళ్లకు తల్లిగా ప్రమోషన్- డబుల్ ధామాకా!

తెలుగులో మనసు పలికే మౌనం గీతం టైటిల్‌తో

హిందీలో సూపర్ హిట్ సీరియల్‌లో ఏ హై మొబహబ్బతీన్ ఒకటి. ఈ సీరియల్‌ను తెలుగులో మనసు పలికే మౌనం గీతం టైటిల్‌తో ప్రసారం చేశారు. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ నటి దివ్యాంక త్రిపాఠి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో తన సీరియల్స్‌తో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి తల్లిగా ప్రమోషన్ పొందింది.

అయితే, దివ్యాంకతోపాటు ఆమె భర్త వివేక్ దహియాకు కూడా హిందీలో మంచి క్రేజ్ ఉంది. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీ జంటగా దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా నిలిచారు. అలాంటి ారి జీవితంలో సరికొత్త వసంతం విరిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

కవల పిల్లలకు

అదీ కూడా ఒకేసారి ఇద్దరు బుజ్జాయిలు వారి జీవితంలోకి అడుగుపెట్టారు. సీరియల్ హీరోయిన్ దివ్యాంక త్రిపాఠి కవల మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త, నటుడు వివేక్ దహియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో వారి అభిమానులు ఆనందంలో ములిగి తేలుతున్నారు.

'మేరే కరణ్ అర్జున్ ఆగయే' అంటూ పోస్ట్

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివేక్ దహియా ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటారు. నీలం రంగు దుస్తుల్లో ఇద్దరు పసిపాపలు పక్కపక్కనే కూర్చుని ఉన్న ఆ ఫొటోపై "మేము దేవుడిని కాస్త సంతోషాన్ని ఇవ్వమని అడిగాం.. కానీ, ఆ దేవుడు డబుల్ ధమాకా ఇచ్చాడు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు" అని రాసి ఉన్న టెక్ట్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోకు వివేక్ జోడించిన ఎమోషనల్ నోట్ నెటిజన్ల మనసులను తాకుతోంది. "ఎదురుచూపులకు తెరపడింది.. 'ది బాయ్స్' వచ్చేసారు. మేము ఊహించిన దానికంటే జీవితం ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తోంది. మేరే కరణ్ అర్జున్ ఆగయే! దివ్యాంక, మేము తల్లిదండ్రులుగా ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాకు కావాలి" అని వివేక్ పేర్కొన్నారు.

సెలబ్రిటీల శుభాకాంక్షల వర్షం

ఈ శుభవార్త వినగానే తోటి నటీనటులు, పరిశ్రమ వర్గాలు ఈ దంపతులపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. నటి ఆకాంక్ష పూరి స్పందిస్తూ.. "ఓ మై గాడ్! మీ ఇద్దరికీ అభినందనలు, చాలా సంతోషంగా ఉంది" అని కామెంట్ చేయగా.. మాహి విజ్, పరంపర టాండన్ కూడా కొత్త తల్లిదండ్రులకు విషెస్ చెప్పారు. ఇక అభిమానులైతే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. "కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, లవ్లీ కపుల్‌కి డబుల్ సెలబ్రేషన్స్" అంటూ కామెంట్ల సెక్షన్ నింపేస్తున్నారు.

'యే హై మొహబ్బతీన్' సెట్స్‌లో మొదలైన ప్రేమాయణం

దివ్యాంక, వివేక్ లవ్ స్టోరీ ఒక సినిమా కథను తలపిస్తుంది. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన 'యే హై మొహబ్బతీన్' సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరికీ మొదటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై ప్రేమగా రూపాంతరం చెందింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి 2016 జూలైలో భోపాల్ వేదికగా వీరిద్దరూ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో 'నాచ్ బలియే'లో పాల్గొని టైటిల్ విజేతలుగా నిలిచారు. సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత ఈ ఏడాది మార్చి నెలలో దివ్యాంక తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమె బేబీ బంప్‌తో దిగిన ఫొటోలు నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి.

పండుగ వాతావరణం

ఇటీవలే ఈ జంట ఒక సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. అందులో తమ దైనందిన జీవిత విశేషాలతో పాటు ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు కవలలు రావడంతో వీరి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More