Mouni Roy Divorce: విడిపోనున్న మరో సెలబ్రిటీ జంట- ఒకరినొకరు అన్‌ఫాలో- భర్తకు సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు?

Mouni Roy Is Headed To Divorce With Husband Suraj Nambiar: బాలీవుడ్ గ్లామర్ డాల్ మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మౌనీ, సూరజ్ జంట విడిపోయి విడాకులు తీసుకోనున్నారని వస్తున్న వార్తలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

May 12, 2026, 10:10:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mouni Roy Is Head To Divorce With Suraj Nambiar: బాలీవుడ్ బ్యూటీ, సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ వైవాహిక జీవితంపై గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన అందచందాలతో, నటనతో కుర్రకారును మాయ చేసే మౌనీ రాయ్.. తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోబోతోందనే వార్త ఇప్పుడు అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

విడిపోనున్న మరో సెలబ్రిటీ జంట- ఒకరినొకరు అన్‌ఫాలో- భర్తకు సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు?
విడిపోనున్న మరో సెలబ్రిటీ జంట- ఒకరినొకరు అన్‌ఫాలో- భర్తకు సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు?

మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా సెలబ్రిటీల మధ్య మనస్పర్థలు వస్తే మొదట జరిగేది సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడమే కాబట్టి, మౌనీ రాయ్ జంట విషయంలో కూడా అదే జరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో అన్‌ఫాలో.. మొదలైన విడాకుల ప్రచారం

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచుగా తమ వెకేషన్ ఫోటోలను, రొమాంటిక్ క్షణాలను పంచుకునే ఈ జంట.. ఒక్కసారిగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే, వీరిద్దరి ప్రొఫైల్స్‌లో ఇప్పటికీ పెళ్లి ఫోటోలు, పాత పోస్ట్‌లు అలాగే ఉండటం గమనార్హం.

కేవలం అన్‌ఫాలో మాత్రమే చేశారా లేక ఫోటోలను కూడా డిలీట్ చేయనున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, సూరజ్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల కింద నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. "పెళ్లి ఫోటోలు ఎక్కడ? త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా?" అని కొందరు, "ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కదా.. ఏమైంది?" అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి.. ఇప్పుడు ఏమైంది?

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన సూరజ్ నంబియార్‌ను 2022 జనవరిలో మౌనీ రాయ్ వివాహం చేసుకున్నారు. గోవాలోని ప్రముఖ హిల్‌టన్ రిసార్ట్‌లో మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల్లో వీరి వివాహం కన్నుల పండువగా జరిగింది.

ఆ సమయంలో "నా జీవిత భాగస్వామి దొరికాడు" అంటూ మౌనీ రాయ్ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన జైన కుటుంబం నుంచి వచ్చిన సూరజ్, పక్కా బెంగాలీ అయిన మౌనీ.. సంప్రదాయాలను గౌరవిస్తూ చేసుకున్న ఆ పెళ్లి అప్పట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

పెళ్లయిన నాలుగేళ్లకే మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జంట మధ్య విభేదాలు తలెత్తడంపై అటు బాలీవుడ్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇప్పటి వరకు మౌనీ కానీ, సూరజ్ కానీ అధికారికంగా స్పందించలేదు.

ఒకవైపు విడాకుల రచ్చ.. మరోవైపు కెరీర్ జోరు

వైవాహిక జీవితంలో ఇలాంటి గందరగోళం నడుస్తున్నప్పటికీ, మౌనీ రాయ్ తన కెరీర్‌పై దృష్టి సారిస్తున్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంలో మౌనీ రాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా చేశారు.

ముందుగా మే 22న విడుదల కావాల్సిన ఈ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూన్ 5కు వాయిదా పడింది. కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో, మౌనీ రాయ్ సినిమాను మళ్లీ పాత తేదీకి మార్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్‌లో మౌనీ రాయ్ దూసుకుపోతున్నారు.

భర్త సూరజ్ నంబియార్‌ను ఫాలో అవ్వని మౌనీ రాయ్
భర్త సూరజ్ నంబియార్‌ను ఫాలో అవ్వని మౌనీ రాయ్
భార్య మౌనీ రాయ్‌ను అన్‌ఫాలో చేసిన భర్త సూరజ్ నంబియార్
భార్య మౌనీ రాయ్‌ను అన్‌ఫాలో చేసిన భర్త సూరజ్ నంబియార్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఎప్పుడు వివాహం చేసుకున్నారు?

వీరు 2022 జనవరి 27న గోవాలో మలయాళీ మరియు బెంగాలీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

2. సూరజ్ నంబియార్ ఎవరు? ఆయన వృత్తి ఏమిటి?

సూరజ్ నంబియార్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.

3. మౌనీ రాయ్ నటిస్తున్న తదుపరి సినిమా ఏది?

డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai) చిత్రంలో మౌనీ రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.

4. వీరిద్దరూ విడిపోతున్నారని ప్రచారం ఎందుకు మొదలైంది?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మౌనీ, సూరజ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడాకుల ప్రచారం మొదలైంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More