Mafia Threat: గన్లతో వస్తామని బెదిరింపులు, మాఫియాతో పనిమనిషి గొడవ- ఇల్లు వదిలి పారిపోయిన స్టార్ హీరో వరుణ్ ధావన్ కుటుంబం

Varun Dhawan Reveals Mafia Threat And Leaves House: పూరి జగన్నాథ్ గోలీమార్ సినిమా తరహాలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కుటుంబానికి జరిగింది. 90వ దశకంలో బాలీవుడ్‌ను వణికించిన అండర్ వరల్డ్ మాఫియా సెగలు తన కుటుంబాన్ని కూడా తాకాయని, తన తండ్రికి వచ్చిన ఫోన్ కాల్స్ గురించి వరుణ్ ధావన్ వివరించారు.

Mar 28, 2026, 15:55:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండర్ వరల్డ్ నీడలో మగ్గిపోయేది. షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, కరణ్ జోహార్ వంటి హేమాహేమీలకు కూడా మాఫియా నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

గన్లతో వస్తామని బెదిరింపులు, మాఫియాతో పనిమనిషి గొడవ- ఇల్లు వదిలి పారిపోయిన స్టార్ హీరో వరుణ్ ధావన్ కుటుంబం
గన్లతో వస్తామని బెదిరింపులు, మాఫియాతో పనిమనిషి గొడవ- ఇల్లు వదిలి పారిపోయిన స్టార్ హీరో వరుణ్ ధావన్ కుటుంబం

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ‘యువా’ (Yuvaa) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొన్న ఒక భయానక, వింతైన అనుభవాన్ని పంచుకున్నారు. అండర్ వరల్డ్ బెదిరింపుల కారణంగా తమ ఇల్లు వదిలి ఒక రోజంతా వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.

మాఫియాతో మా పనిమనిషి వాగ్వాదం!

వరుణ్ ధావన్ ఆనాటి సంఘటనను వివరిస్తూ.. "అప్పట్లో చాలా మంది సెలబ్రిటీలకు మాఫియా కాల్స్ వచ్చేవి. మాకు కూడా చాలా కాలం నుంచి అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆ కాల్స్ ఎత్తిన మా ఇంట్లోని స్టాఫ్, అవతలి వ్యక్తి ఎవరన్నది తెలియక వారితో వాగ్వాదానికి దిగేవారు" అని వరుణ్ ధావన్ తెలిపాడు.

"‘నువ్వు ఎవడవైతే మాకేంటి? దమ్ముంటే ఆ గార్డెన్‌లోకి రా.. నిన్ను కొట్టి చూపిస్తా’ అని మా పనిమనిషి వాళ్లకు సవాల్ విసిరేవాడు. అంతేకాదు, మా ఇంటి అడ్రస్ కూడా వాళ్లకు చెప్పేసి రమ్మని పిలిచేవాడు" అని నవ్వుతూనే ఆనాటి గందరగోళాన్ని గుర్తు చేసుకున్నారు హీరో వరుణ్ ధావన్.

గన్లతో వస్తామని బెదిరింపు

అయితే ఈ విషయం ఒక స్టార్ హీరో ద్వారా దర్శకుడు డేవిడ్ ధావన్ చెవిన పడటంతో పరిస్థితి సీరియస్ అయింది. "విషయం చేజారిపోతోందని, అవతలి వ్యక్తి తుపాకులతో వస్తానని బెదిరిస్తున్నాడని మా నాన్నకు ఒక నటుడు ఫోన్ చేసి హెచ్చరించాడు" అని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు.

"అతను మా ఆఫీస్ టైమింగ్స్, అడ్రస్ అన్నీ వాళ్లకు తెలిసిపోయాయని చెప్పాడు. దీంతో ఆ రోజు రాత్రే మేమంతా ఇల్లు వదిలి వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాము. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇది వింతగా అనిపించినా, అప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము" అని వరుణ్ ధావన్ వివరించారు.

గోలీమార్ సినిమా తరహాలో

అంటే, సేమ్ తెలుగు మూవీ గోలీమార్‌లో చూపించినట్లుగా వరుణ్ ధావన్ రియల్ జీవితంలో జరిగినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన గోలీమార్ సినిమాలో కూడా ఓనర్‌కు గ్యాంగ్‌స్టర్ కాల్ చేస్తే ఇంటి పనిమనిషి రెచ్చగొట్టే సన్నివేశం గుర్తుండే ఉంటుంది. దాదాపుగా అలానే హీరో వరుణ్ ధావన్ రియల్ లైఫ్‌లో జరిగిందని ఈ సంఘనటతో అర్థమవుతోంది.

వరుణ్ ధావన్ సినిమా విశేషాలు

వరుణ్ ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్ వంటి తారలతో కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 20న నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

యశ్ టాక్సిక్ కారణంగా

ప్రస్తుతం తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదల కోసం వరుణ్ ధావన్ ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను ముందుగా జూన్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు ఉంది. కానీ, యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా జూన్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More