Nidhi Shah OTT: టీవీ నుంచి ఓటీటీకి సీరియల్ హీరోయిన్- ఆ ఇమేజ్ నుంచి బయటపడేందుకు రిస్క్ చేస్తున్న అనుపమ కోడలు నిధి షా!
TV Serial Actress Nidhi Shah OTT Debut With Web Series: బుల్లితెరపై అనుపమ సీరియల్‌లో కింజల్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ నిధి షా ఇప్పుడు ఓటీటీ బాట పట్టారు. తన ఇమేజ్‌ను మార్చుకునేందుకు సిద్ధమైన ఈ భామ, ఓటీటీ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.
TV Serial Actress Nidhi Shah OTT Debut: స్టార్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'అనుపమ' సీరియల్ చూసే ప్రతి ఇంట్లో కింజల్ అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయారు నిధి షా. అయితే, గత కొంతకాలంగా సీరియల్స్ నుంచి విరామం తీసుకున్న ఆమె ఇప్పుడు 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' (Sapne Vs Everyone) సీజన్-2 ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

కింజల్‌గానే
"చాలా కాలంగా నేను ఎదురుచూస్తున్న క్షణం ఇది. కింజల్‌గా నన్ను ఎంతో ప్రేమించిన ప్రేక్షకులు, ఇప్పుడు ఈ కొత్త పాత్రలో 'నిధి'ని చూస్తారని ఆశిస్తున్నాను" అని తన ఎగ్జైట్‌మెంట్‌ను పంచుకున్నారు.
టీవీ ఇమేజ్ నుంచి బయటపడటం అంత ఈజీ కాదు!
తెలుగు, హిందీ సీరియల్ నటీనటులకు ఒక సమస్య ఉంటుంది. ఒకసారి ఒక పాత్రలో హిట్ అయితే, జనం వారిని అదే పేరుతో పిలుస్తుంటారు. నిధి విషయంలోనూ అదే జరిగింది. "ఎక్కడికి వెళ్లినా నన్ను కింజల్ అనే పిలుస్తున్నారు. నా నిజం పేరు నిధి అని చాలామందికి తెలియదు. ఆ ఇమేజ్ నుంచి బయటపడటం కోసం నేను చాలా రిస్క్ తీసుకున్నాను. కింజల్ పాత్రను పోలిన ఎన్నో ఆఫర్లు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు నేనుగా కొత్తగా నిరూపించుకోవాలని ఉంది" అని నిధి షా పేర్కొన్నారు.
ఓటీటీ కోసం ప్రత్యేక శిక్షణ
టెలివిజన్ రంగంలో నటన కాస్త లౌడ్‌గా, హావభావాలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. కానీ ఓటీటీ అలా కాదు. ఈ మార్పు గురించి నిధి చెబుతూ.. "టీవీలో చేసే నటనకు, ఓటీటీకి చాలా తేడా ఉంది. అందుకే నేను డాన్స్ క్లాసులు, వర్క్‌షాప్‌లకు హాజరయ్యాను. కొన్ని పాత పద్ధతులను మర్చిపోయి (Unlearn), ఓటీటీకి కావాల్సిన సూక్ష్మమైన నటనను నేర్చుకున్నాను" అని వివరించారు. ఈ 27 ఏళ్ల నటి తన పాత్ర కోసం ఎంతలా కష్టపడిందో ఆమె మాటల్లోనే అర్థమవుతోంది.
'విధి'గా సరికొత్త ప్రయాణం
'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' మొదటి సీజన్ చూసినప్పుడే ఆ కథకు కనెక్ట్ అయ్యానని, అందుకే రెండో సీజన్ కోసం ఆడిషన్ ఇచ్చానని నిధి షా తెలిపారు. ఇందులో ఆమె 'విధి' అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఓటీటీ వెబ్ సిరీస్
నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ఈ ఓటీటీ వెబ్ సిరీస్ ఒక మంచి వేదిక అవుతుందని నిధి షా నమ్మకంగా ఉన్నారు. కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను మలుచుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నిధి షా ఏ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు?
నిధి షా హిందీ పాపులర్ సీరియల్ 'అనుపమ' (తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది) లో కింజల్ పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొందారు.
2. నిధి షా ఓటీటీ అరంగేట్రం చేస్తున్న వెబ్ సిరీస్ ఏది?
ఆమె 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' (Sapne Vs Everyone) సీజన్-2 ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర పేరు విధి.
3. సీరియల్స్ నుంచి ఆమె ఎందుకు బ్రేక్ తీసుకున్నారు?
ఒకే రకమైన పాత్రలు రావడం వల్ల బోర్ ఫీల్ అయిన నిధి, తన ఇమేజ్ మార్చుకోవడానికి, ఓటీటీ రంగంలో వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఈ విరామం తీసుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


