OTT: ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- ఏకంగా 9.9 రేటింగ్- సీరియల్ కిల్లర్‌గా మొసలి- ఇక్కడ చూసేయండి!
OTT Crime Investigative Thriller: ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాక్షస స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఫిబ్రవరి 20 అంటే నిన్నటి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు ఏకంగా 9.9 రేటింగ్ రావడం ఆశ్చర్యంగా మారింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ రాక్షస ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో వచ్చే కంటెంట్‌లో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్స్‌కు అంతా అట్రాక్ట్ అవుతుంటారి. ఎంత డిఫరెంట్‌గా ఈ జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తే అవి అంతగా క్లిక్ అవుతాయి. అయితే, తాజాగా ఓటీటీలోకి నయా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్
ఇలా రాగానే ఆ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 9.9 రేటింగ్ రావడం ఓటీటీ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగిస్తోంది. రేటింగ్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఆ వెబ్ సిరీస్ పేరు రాక్షస (Raakshasa). ఇది కన్నడ భాషలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి హీరోకు భార్యగా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాక్షస ఓటీటీ సిరీస్‌లో అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
25 నిమిషాలు, 7 ఎపిసోడ్స్
రాక్షస వెబ్ సిరీస్‌కు సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నిర్మాత తరుణ్ సుధీర్ రాక్షస వెబ్ సిరీస్‌ను నిర్మించారు. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో ఏడు ఎపిసోడ్స్ ఉన్న రాక్షస వెబ్ సిరీస్ ఒక మొసలి, ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ సాగుతుంది.
సిరీస్‌లో జరిగే హత్యలను సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా, లేదా మొసలి చంపుతుందా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కో సమయంలో మొసలే సీరియల్ కిల్లర్ అనేలా కథనం సాగుతుంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లలో నేరస్థుడిని పట్టుకోవడం ఒక ఎత్తైతే, ఆ నేరం వెనుక ఉన్న మానసిక సంఘర్షణను ఆవిష్కరించడం మరో ఎత్తు.
ఎస్సైకి తలనొప్పిగా
రాక్షస సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చంపేది మనుషులా, మొసల అనే విషయం ఎస్సై హనుమప్పకు తలనొప్పిగా మారుతుంది. ఈ కథ అంతా నార్త్ కర్ణాటకలోని సౌదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంటుంది.
ఓ పండుగ సమయంలో నది ఒడ్డున మనిషి శరీర భాగాలు పోలీసులకు లభిస్తాయి. అతన్ని చంపింది మొసలే అని ప్రజలు భయపడుతుంటారు. అప్పటికే సౌదత్తి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసులు చాలా వరకు నమోదు అయి ఉంటాయి. మరి వారంతా ఏమయ్యారు?, మొసలికి బలయ్యారా? లేదా ఇంకేదైనా మిస్టరీ ఉందా? అనేది ఎస్సై హనుమప్ప తెలుసుకున్నాడా అనే అంశాలతో సాగే ఓటీటీ సిరీస్ రాక్షస.
జీ5 ఓటీటీలో
ఇలా ఉత్కంఠం రేపే రాక్షస ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 20 అంటే నిన్నటి నుంచి జీ5లో రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే మంచి క్రేజ్ తెచ్చుకున్న రాక్షస సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో సుమారు 18 వేల మంది వరకు యూజర్స్ 9.9 రేటింగ్ ఇచ్చి టాప్‌లో ఉంచారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జీ5 ఓటీటీ సిరీస్ రాక్షసపై లుక్కేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


