Ranveer Allahbadia: ఓటీటీ నటితో యూట్యూబర్ రణ్‌వీర్ ప్రేమాయణం- రొమాంటిక్ ఫొటోలతో పరిచయం- జూహీ భట్ క్రేజ్ ఇదే!

YouTuber Ranveer Allahbadia Introduce Lover Juhi Bhatt: ప్రముఖ యూట్యూబర్, బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్ హోస్ట్ రణ్‌వీర్ అల్లాబాడియా ఓటీటీ నటి జూహీ భట్‌తో ప్రేమలో ఉన్నట్లు తాజాగా అధికారింగా కన్ఫర్మ్ చేశాడు. దీనికి సంబంధించి రొమాంటిక్ ఫొటోలను షేర్ చేశాడు. మరి జూహీ భట్‌కు ఉన్న క్రేజ్‌పై లుక్కేద్దాం.

Published on: Apr 28, 2026, 13:58:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

YouTuber Ranveer Allahbadia Introduce Lover Juhi Bhatt: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అల్లాబాడియా (BeerBiceps) తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా నెట్టింట సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఓటీటీ నటి జూహీ భట్‌‌ను తాను ప్రేమిస్తున్నట్లు రొమాంటిక్ ఫోటోలతో సహా వెల్లడించారు రణ్‌వీర్.

ఓటీటీ నటితో యూట్యూబర్ రణ్‌వీర్ ప్రేమాయణం- రొమాంటిక్ ఫొటోలతో పరిచయం- జూహీ భట్ క్రేజ్ ఇదే! (Instagram/@beerbiceps)
ఓటీటీ నటితో యూట్యూబర్ రణ్‌వీర్ ప్రేమాయణం- రొమాంటిక్ ఫొటోలతో పరిచయం- జూహీ భట్ క్రేజ్ ఇదే! (Instagram/@beerbiceps)

రొమాంటిక్ ఫొటోలతో

తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే రణ్‌వీర్, ఈసారి మాత్రం ఏకంగా కెన్యాలోని మాసాయ్ మారా నేషనల్ పార్క్ నుంచి రొమాంటిక్ ఫోటోలను షేర్ చేశారు. "సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.. వీటన్నిటి మధ్యలో ప్రపంచంలోని ప్రతికూలతలను తన వెలుగుతో కాల్చేసే వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా? నేను కలిశాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు రణ్‌వీర్.

‘హార్డ్ లాంచ్ ఫ్రమ్ ది మారా’ అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ బంధాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశాడు యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా. అయితే, రణ్‌వీర్ పోస్టుపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

జూహీ భట్ రియాక్షన్

"త్వరగా పెళ్లి చేసేసుకో" అని ఆశిష్ చంచ్లానీ జోక్ చేయగా, సద్గుణ్ మెహతా హార్ట్ ఎమోజీలతో విష్ చేశారు. ఓరీ కూడా ఈ జంటకు అభినందనలు తెలిపారు. అటు జూహీ భట్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "చాలా కాలంగా దీని కోసం కలలు కన్నాను. నిజంగా జరిగినప్పుడు ఇంత బాగుంటుందని అనుకోలేదు. కెన్యా.. నీ కోసం వేచి ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది" అని రాసుకొచ్చారు.

అనుమానాల నుంచి అధికారిక ప్రకటన వరకు

నిజానికి రణ్‌వీర్ అల్లాబాడియా, జూహీ భట్ ప్రేమాయణం గురించి 2025 అక్టోబర్ నుంచే వార్తలు మొదలయ్యాయి. దీపావళి వేడుకల సమయంలో ఒకే రకమైన డెకరేషన్ ఉన్న ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో నెటిజన్లకు అనుమానం వచ్చింది. అంతకుముందు రణ్‌వీర్.. నటి నిక్కీ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అప్పట్లో ఆమె ముఖాన్ని సన్‌ఫ్లవర్ ఎమోజీతో కప్పి ఉంచి ఫోటోలు పెట్టేవారు. అయితే ఇటీవలే ఆమెను అన్‌ఫాలో చేయడంతో ఆ బంధం ముగిసిందని అంతా భావించారు. ఈ ఏడాది ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా రణ్‌వీర్-జూహీ జంటగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

వివాదాల నడుమ రణ్‌వీర్

రణ్‌వీర్ అల్లాబాడియా ఇటీవలే ఒక భారీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో తల్లిదండ్రుల గురించి అడిగిన ఒక అభ్యంతరకరమైన ప్రశ్న సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో రణ్‌వీర్, సమయ్ రైనా సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ వివాదాల నుంచి బయటపడటానికి ఆయన కొంత విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఎవరీ జూహీ భట్?

ముంబైకి చెందిన జూహీ భట్ ఒక ఓటీటీ నటి, డిజిటల్ క్రియేటర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కథక్, కాంటెంపరరీ డ్యాన్స్‌లో శిక్షణ పొందిన జూహీ మొదట ఫిల్మ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టారు.

'తుమ్సే నా హో పాయేగా' వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లు, ఫిల్టర్ కాపీ వీడియోలతో జూహీ భట్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే కరణ్ ట్యాకర్, కల్కి కోచ్లిన్ లతో కలిసి 'భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ' అనే ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌లోనూ నటించారు జూహీ భట్. ఇలా సోషల్ మీడియా ఫోలవర్స్, ఓటీటీ సిరీస్‌లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు నటి జూహీ భట్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రణ్‌వీర్ అల్లాబాడియా ఎవరితో ప్రేమలో ఉన్నారు?

రణ్‌వీర్ అల్లాబాడియా (BeerBiceps) ఓటీటీ నటి, డిజిటల్ క్రియేటర్ జూహీ భట్‌తో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.

2. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను ఎక్కడ ప్రకటించారు?

కెన్యాలోని మాసాయ్ మారా నేషనల్ పార్క్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఈ జంట, అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని కన్ఫర్మ్ చేశారు.

3. జూహీ భట్ ఏయే సినిమాల్లో లేదా సిరీస్‌లలో నటించారు?

జూహీ భట్ 'ఫుక్రే 3'లోని 'వే ఫుక్రే' సాంగ్‌లో కనిపించారు. అలాగే 'తుమ్సే నా హో పాయేగా' వెబ్ సిరీస్, 'భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ' సిరీస్‌లలో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More