Rakesh Bedi: ఆ ఒక్కడి వల్లే ధురంధర్‌కు రూ.500 కోట్లు అంటూ రణ్‌వీర్ పొగడ్తలు.. మరి ఆ నటుడికి దక్కిన రెమ్యునరేషన్ ఎంతంటే?

Rakesh Bedi: ధురంధర్ మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నటుడు రాకేష్ బేడీ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తేలిపోయింది. మూవీ సక్సెస్ తో అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ను మేకర్స్ రెట్టింపు చేయడం విశేషం.

Published on: Apr 24, 2026, 12:28:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rakesh Bedi: ఆదిత్య ధర్ సృష్టించిన ‘ధురంధర్’ (2025), ‘ధురంధర్ 2: ద రివెంజ్’ (2026) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడమే కాకుండా, అందులో నటించిన నటీనటుల జీవితాలను కూడా మార్చేశాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు రాకేష్ బేడీ పోషించిన ‘జమీల్ జమాలీ’ పాత్ర ఒక కల్ట్ ఐకాన్‌గా మారిపోయింది. ధురంధర్ కు రూ.1000 కోట్ల వస్తే అందులో సగం ఆ ఒక్కడి వల్లే అంటూ రణ్‌వీర్ సింగ్ కూడా పొగిడిన రాకేష్ బేడీ రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

Rakesh Bedi: ఆ ఒక్కడి వల్లే ధురంధర్‌కు రూ.500 కోట్లు అంటూ రణ్‌వీర్ పొగడ్తలు.. మరి ఆ నటుడికి దక్కిన రెమ్యునరేషన్ ఎంతంటే?
Rakesh Bedi: ఆ ఒక్కడి వల్లే ధురంధర్‌కు రూ.500 కోట్లు అంటూ రణ్‌వీర్ పొగడ్తలు.. మరి ఆ నటుడికి దక్కిన రెమ్యునరేషన్ ఎంతంటే?

మీమ్స్ రాజ్యాన్నేలిన ‘జమీల్ జమాలీ’

చాలా కాలం తర్వాత రాకేష్ బేడీ ‘ధురంధర్’ సిరీస్‌తో వెండితెరపై గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇందులో ఆయన చెప్పిన "బచ్చా హై తూ మేరా" (నువ్వు నా బిడ్డవు) అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.

ప్రతి చిన్న విషయానికి నెటిజన్లు ఈ డైలాగ్‌తో మీమ్స్ చేస్తూ రాకేష్ బేడీకి విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశారు. ఈ క్రేజ్ చూసిన మేకర్స్, ఆయనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.

రెమ్యునరేషన్ డబుల్.. మేకర్స్ గొప్ప మనసు

సాధారణంగా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా అదే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ‘ధురంధర్’ మేకర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. రాకేష్ బేడీ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడంతో, ఆయనకు అదనపు పారితోషికాన్ని అందించారు.

సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ‘ధురంధర్ 2’ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని చూసి దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాత లోకేష్ ధర్ స్వయంగా రాకేష్ బేడీకి రూ. 1 కోటి చెక్కును అందజేశారు. అంటే ఆయన అడిగిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని గౌరవంగా ఇచ్చారన్నమాట. ఇలాంటి ఉదారత సినీ పరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

పాత్రలో ట్విస్ట్.. గూఢచారిగా రాకేష్ బేడీ

సినిమాలో రాకేష్ బేడీ కరాచీకి చెందిన ఒక కుటిల రాజకీయ నాయకుడు జమీల్ జమాలీగా కనిపిస్తారు. ఆయన కూతురు యలీనాను హమ్జా (రణవీర్ సింగ్) వివాహం చేసుకుంటాడు. అయితే రెండో భాగంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. జమీల్ జమాలీ నిజానికి పాకిస్థాన్‌లో స్థిరపడిన భారత గూఢచారి (Indian Spy) అని వెల్లడవుతుంది. ఈ ట్విస్ట్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.

"ప్రజలు థియేటర్లకు క్యూ కడుతున్నారు, సినిమాలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. నేను ఢిల్లీలో ఒక అభిమానిని కలిసినప్పుడు, అతను ఈ సినిమాను ఇప్పటికే 10 సార్లు చూశానని చెప్పాడు. వాస్తవాన్ని అలాగే చూపించినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు" అని రాకేష్ బేడీ ఒక ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకొచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More