Dhurandhar Actor: పాకిస్థాన్‌ను వాళ్ల నేతల కంటే మేమే బాగా నడపగలం: ధురంధర్ 2 నటుడు ముస్తాఫా అహ్మద్ సెటైర్
Dhurandhar Actor: పాకిస్థాన్ రాజకీయాలపై అదిరిపోయే సెటైర్ వేశాడు ధురంధర్ 2 నటుడు ముస్తాఫా అహ్మద్. ఆ దేశాన్ని వాళ్ల నేతల కంటే తామే బాగా నడపగలమని అతడు అనడం గమనార్హం. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Dhurandhar Actor: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాల్లో భారత గూఢచారి ‘రిజ్వాన్’గా మెప్పించిన ముస్తఫా అహ్మద్.. తాజాగా రెడిట్ (Reddit) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు రణవీర్ సింగ్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పై వేసిన సెటైర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.

పాకిస్థాన్ రాజకీయాలపై ‘రిజ్వాన్’ సెటైర్లు
‘ధురంధర్’ సిరీస్‌లో పాకిస్థాన్‌లోని లియారీ గ్యాంగ్స్‌లో చొరబడిన భారత ఏజెంట్‌గా ముస్తఫా అహ్మద్ అద్భుత నటనను కనబరిచారు. ‘ధురంధర్ 2’లో హమ్జా (రణవీర్ సింగ్) తిరిగి భారత్‌కు వచ్చేయడంతో, అక్కడ రిజ్వాన్ పరిస్థితి ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది.
దీనిపై ముస్తఫా స్పందిస్తూ.. "హమ్జా వదిలి వెళ్ళిన బాధ్యతలను రిజ్వాన్ అందుకుంటాడు. అతని అసలు గుర్తింపు ఎవరికీ తెలియదు కాబట్టి, పాక్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేసేందుకు అతను అక్కడే ఉంటాడు" అని వెల్లడించారు.
మరో భారత ఏజెంట్ జమీల్ జమాలీ (రాకేష్ బేడీ)తో కలిసి రిజ్వాన్ తదుపరి కార్యాచరణ ఉంటుందా? అని ఓ అభిమాని అడగ్గా.. "ఖచ్చితంగా, జమీల్ సాబ్, నేను కలిసి పాకిస్థాన్‌ను స్వాధీనం చేసుకోగలము. అక్కడి రాజకీయ నాయకుల కంటే మేమే ఆ దేశాన్ని బాగా నడపగలము" అంటూ పాక్ రాజకీయాలపై సెటైర్లు వేశారు.
రణవీర్ సింగ్‌తో పనిచేయడం అంత సులభం కాదు
ముస్తఫా అహ్మద్ కేవలం నటుడు మాత్రమే కాదు.. రణవీర్ సింగ్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ వంటి స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా వ్యవహరించారు. రణవీర్‌తో నటన గురించి చెబుతూ.. "అతనితో పనిచేయడం అంత సులభం కాదు. రణవీర్ తన పనిలో 100% ఇస్తాడు. ఎదుటివారి నుండి కూడా అదే ఆశిస్తాడు. రిజ్వాన్ పాత్రను తీర్చిదిద్దడంలో అతను నాకు ఎంతో సహాయం చేశాడు. సెట్‌లో నన్ను సమానంగా చూశాడు. ఆ జ్ఞాపకాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని కొనియాడారు.
ఫిట్‌నెస్ ట్రైనర్ నుండి నటుడి వరకు..
నటుడిగా మారడం గురించి ముస్తఫా మాట్లాడుతూ.. తనకు కేవలం కండలు చూపించే పాత్రలే కాకుండా, భావోద్వేగాలను పండించే పాత్రలు చేయాలని ఉందని తెలిపారు.
"నాకు యాక్షన్ అంటే ప్రాణం. కానీ కామెడీ చేయాలని కూడా ఉంది. వెస్ట్ ఢిల్లీ కుర్రాడిగా లేదా జాట్ (Jaat) పాత్రలో నటించడం చాలా సరదాగా ఉంటుంది" అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
రూ.3100 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన రెండు ‘ధురంధర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో రూ.3100 కోట్లకు పైగా వసూలు చేశాయి. రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ వంటి దిగ్గజ నటులు ఈ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇండియన్ స్పై థ్రిల్లర్ సినిమాల్లో ఈ ఫ్రాంచైజీ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


