Dhurandhar 2 OTT Release: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్.. ఏకంగా రూ.150 కోట్ల జాక్‌పాట్.. ఐపీఎల్ వల్లే ఆలస్యం?
Dhurandhar 2 OTT Release: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్, డీల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీపై స్పష్టత లేకపోయినా.. దీనికి ఏకంగా రూ.150 కోట్ల డీల్ కుదిరిందన్న వార్త ఆసక్తి రేపుతోంది.
Dhurandhar 2 OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ.. భారీ ధరకు ఓటీటీ డీల్‌ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ ఏకంగా రూ. 150 కోట్లు ఇచ్చిందట.

బాక్సాఫీస్ రికార్డుల 'ధురంధర్'
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియాలో రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ మూవీగా 'ధురంధర్ 2' రికార్డు సృష్టించింది.
రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హంజా అలీ మజారీగా, జస్క్రీత్ సింగ్ రంగీగా ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
నెట్‌ఫ్లిక్స్‌కు షాక్.. జియో హాట్‌స్టార్ సొంతం
ధురంధర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ విషయంలోనూ ఓ ట్విస్ట్ ఉంది. నిజానికి 'ధురంధర్' మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. కానీ సీక్వెల్ విషయంలో సీన్ మారింది. ఈసారి జియో హాట్‌స్టార్ (JioHotstar) భారీ పోటీ మధ్య ఈ సినిమా డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది.
సుమారు రూ. 120 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గతేడాది మొదటి భాగం కోసం నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లు వెచ్చించగా.. రెండో భాగానికి ఆ రేటు రెట్టింపు అవ్వడం రణ్‌వీర్ క్రేజ్‌కు నిదర్శనం.
స్ట్రీమింగ్ ఎప్పుడు? ఫ్యాన్స్‌కు నిరీక్షణ తప్పదు
సాధారణంగా సినిమాలు విడుదలైన 8 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ 'ధురంధర్ 2' విషయంలో నిర్మాతలు భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. థియేటర్లలో ఇప్పటికీ 11 వేలకు పైగా షోలతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో ఇప్పుడే ఓటీటీలోకి తెస్తే థియేటర్ వసూళ్లపై ప్రభావం పడుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
అంతేకాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ సీజన్ ముగిశాకే సినిమాను స్ట్రీమింగ్ చేయాలని జియో హాట్‌స్టార్ నిర్ణయించింది. దీంతో మే మధ్యలో వస్తుందని అందరూ భావించినా.. తాజా అప్‌డేట్ ప్రకారం మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో ఈ సినిమా డిజిటల్ వేదికపైకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.
ధురంధర్ 2 స్టోరీ ఇలా..
పాకిస్థాన్‌లోని కరాచీ నగరం, లియారీ ముఠా రాజకీయాలు, భారత నిఘా సంస్థల ఆపరేషన్ల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. అజిత్ దోవల్ ప్రేరణతో రూపొందిన పాత్రలో మాధవన్ మెప్పించగా, పాకిస్థానీ పోలీస్ ఆఫీసర్‌గా సంజయ్ దత్ నటన హైలైట్‌గా నిలిచింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ధురంధర్ 2 సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది?
ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ (JioHotstar) దక్కించుకుంది. రణ్‌వీర్ సింగ్ గత చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నప్పటికీ, ఈ చిత్రం మాత్రం జియో హాట్‌స్టార్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
2. ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు?
అధికారికంగా తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత, అంటే మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
3. ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. భారత దేశంలోనే రూ. 1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


