Dhurandhar 2 OTT: పుష్ప 2ను దాటేసిన ధురంధర్ 2.. టాప్-3 మూవీగా రికార్డు.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Dhurandhar 2 OTT: ధురంధర్ 2 బాక్సాఫీస్ మోత మోగిస్తూనే ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో మూడో ప్లేస్ కు చేరుకుంది. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసిన ధురంధర్ 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూసేయండి. 

Published on: Apr 19, 2026, 15:34:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ 2 మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న ఇండియన్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌ (HT_PRINT)
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌ (HT_PRINT)

ధురంధర్ 2 రికార్డు

ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 మరో రికార్డు నమోదు చేసింది. బాక్సాఫీస్ మోత మోగిస్తున్న ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1749 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుందని సక్నిల్క్ వెల్లడించింది.

పుష్ప 2 కలెక్షన్లు

అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రికార్డును ధురంధర్ 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 ఏమో ప్రపంచవ్యాప్తంగా రూ. 1742 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడు ధురంధర్ 2 ఆ కలెక్షన్లను దాటేసి మూడో ప్లేస్ కు చేరుకుంది. టాప్-2లో దంగల్ (రూ.2,090 కోట్లు), బాహుబలి 2 (రూ.1788 కోట్లు) ఉన్నాయి.

ధురంధర్ 2 ఓటీటీ

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ డీల్ ను జియోహాట్‌స్టార్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏకంగా రూ.150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ధురంధర్ ఫస్ట్ పార్ట్ కంటే ఇది డబుల్ కావడం విశేషం.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఎనిమిది వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ధురంధర్ 2 మూవీ మే 14 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.

కానీ ధురంధర్ 2 రిలీజై నెల రోజులు అవుతున్నా ఈ మూవీకి ఇంకా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ మూవీ జూన్ 4న ఓటీటీ డెబ్యూ చేస్తుందనే ప్రచారమూ సాగుతోంది.

మరి రెగ్యులర్ విండో ప్రకారం ధురంధర్ 2 ఎనిమిది వారాలకే ఓటీటీలోకి వస్తుందా? లేదా డిజిటల్ స్ట్రీమింగ్ లేట్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. మేకర్స్ దీనిపై ఇంకా అఫీషియల్ సమాచారం ఇవ్వలేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More