Anil Venky OTT: ఇంకా కొబ్బరికాయనే కొట్టలేదు..అప్పుడే అనిల్ రావిపూడి-వెంకీ సినిమాకు అదిరే ఓటీటీ డీల్.. మామూలు క్రేజ్ కాదు
Anil Venky OTT: సినిమా కంప్లీట్ అయ్యాక, లేదంటే షూటింగ్ మధ్యలోనే ఉండగా ఓటీటీ డీల్స్ జరగడం తెలిసిందే. అయితే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, కల్యాణ్ రామ్ చేస్తున్న మూవీకి అదిరే ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలిసింది.
Anil Venky OTT: అపజయమే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి. 9 సినిమాలు తీసిన అతను, అన్ని హిట్లు కొట్టాడు. ఒక్కో సినిమాకు తన కలెక్షన్ల రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో ఈ డైరెక్టర్ కు క్రేజ్ మూమూలుగా ఏర్పడలేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టకముందే ఓటీటీ డీల్ పూర్తి కావడమే అందుకు నిదర్శనం.

అనిల్-వెంకీ ఓటీటీ
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించేశాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. పూజ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. కానీ ఈ మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయిందనే బజ్ వైరల్ గా మారింది.
రికార్డు రేట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీ ఓటీటీ డీల్ అదిరిందనే టాక్ ఉంది. ఈ హీరోలతో పాటు డైరెక్టర్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లకు ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ను జీ స్టూడియోస్ దక్కించుకుందని తెలిసింది.
అదే సెంటిమెంట్
కొంతకాలంగా అనిల్ రావిపూడి సినిమాల హక్కులను జీ స్టూడియోస్ కొనుగోలు చేస్తూ వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ రైట్స్ ను జీ స్టూడియోసే దక్కించుకుంది. అందుకే ఈ సినిమాలు ఓటీటీలో జీ5లో, టీవీలోనేమో జీ తెలుగు ఛానెల్ లో వస్తున్నాయి. ఇప్పుడు కొత్త మూవీకి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ అయింది.
ఎందుకా నమ్మకం?
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ కంటే కాస్త ముందు మాత్రమే ఓటీటీ పార్టనర్స్ ఫిక్స్ అవుతున్నారు. ఒకరో ఇద్దరో బడా హీరోల సినిమాలను మినహాయిస్తే అన్నింటికీ ఇదే ఫార్మలా అప్లై అవుతోంది. కానీ అనిల్ రావిపూడి విషయంలో మాత్రం ఓటీటీ సంస్థ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు అర్థమవుతోంది.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, హాయిగా నవ్వి పంపించే సత్తా అనిల్ కు ఉందని ఇప్పటికే ప్రూవ్ అయింది. పటాస్ నుంచి మన శంకర వరప్రసాద్ గారు అనిల్ లెక్క తప్పిందే లేదు. అందుకే ఇప్పుడు అనిల్ సినిమా అంటే చాలు ఎక్కడలేని క్రేజ్ కలుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అయిదో సినిమా
విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న అయిదో సినిమా ఇది. ఇప్పటికే వీళ్లు ఎఫ్1, ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల కోసం కలిసి పనిచేశారు. మరోవైపు నందమూరి కల్యాణ్ రామ్- అనిల్ కాంబోలో ఇది రెండో చిత్రం. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ మూవీతోనే డైరెక్టర్ గా అనిల్ డెబ్యూ చేశాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


