Anil Ravipudi: అఫీషియల్‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.. మ‌న‌వాళ్లు రాసేస్తారు.. హీరోయిన్‌ను అనౌన్స్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: అనిల్ రావిపూడి రూటే సెపరేట్. సినిమా అనౌన్స్ మెంట్స్ నుంచి ప్రమోషన్ల వరకూ డిఫరెంట్ దారిలో సాగిపోతుంటాడు. తాజాగా తన కొత్త సినిమా హీరోయిన్ ను కూడా ఇలాగే అనౌన్స్ చేసేశాడు. అఫీషియల్ గా చెప్పాల్సిన పని లేదంటూ కామెంట్ చేశాడు. 

Published on: Apr 6, 2026, 05:42:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా హీరోయిన్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేసేశాడు.

అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి సినిమా

అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లు, అనౌన్స్ మెంట్లు వేరే లెవల్. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో అతను మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని కన్ఫామ్ చేశాడు అనిల్ రావిపూడి.

అఫీషియల్ గా

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ మెంట్ తర్వాత ఇందులో ఓ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు.

‘‘కృతి శెట్టి త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట రాసేశారు. మనం అఫీషియల్ గా చెప్పాల్సిన పని లేదు. మన బ్రదర్స్ రాసేస్తారు. సీ యూ సూన్ ఆన్ సెట్స్’’అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.

మరో హిట్

లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సినిమలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీనికి విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ చూశానని, ప్రదీక్ కు ఇది మరో హిట్ అవుతుందని లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చెప్పాడు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్

అనిల్ రావిపూడి వరుసగా సూపర్ హిట్ లతో సాగిపోతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ సాధించాయి. తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల మోత మోగించింది.

వెంకీతో అయిదోసారి

విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి అయిదో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్లో ఎఫ్1, ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలు వచ్చాయి. చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో వెంకీ మామ ఓ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More