Anil Ravipudi: దటీజ్ అనిల్ రావిపూడి.. టీవీలోనూ టీఆర్పీ రికార్డులు బ్రేక్.. తొలి మూవీ నుంచి ఇప్పటి వరకూ ఇలా..

Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాలు థియేటర్లు, ఓటీటీలోనే కాదు టీవీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తాయి. తాజాగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు ఏకంగా 14కుపైగా రేటింగ్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మరి అతని కెరీర్లో తీసిన 9 సినిమాల టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

Mar 13, 2026, 20:52:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పేరు అనిల్ రావిపూడి. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై (TRP) కూడా తన సినిమాలతో ప్రభంజనం సృష్టించగలరని అతడు మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ప్రతి మూవీ టీఆర్పీ రేటింగ్స్‌లో అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది.

Anil Ravipudi: దటీజ్ అనిల్ రావిపూడి.. టీవీలోనూ టీఆర్పీ రికార్డులు బ్రేక్.. తొలి మూవీ నుంచి ఇప్పటి వరకూ ఇలా..
Anil Ravipudi: దటీజ్ అనిల్ రావిపూడి.. టీవీలోనూ టీఆర్పీ రికార్డులు బ్రేక్.. తొలి మూవీ నుంచి ఇప్పటి వరకూ ఇలా..

సినిమా సినిమాకూ పెరుగుతున్న క్రేజ్

దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా నుంచే అనిల్ రావిపూడి తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ వస్తున్నాడు. అతని సినిమాల టీఆర్పీ రేటింగ్స్ వివరాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. బాక్సాఫీస్ హిట్ ఒక్కటే కాదు.. టీవీ ఛానెల్స్ కు క్రమంగా జనం దూరమవుతున్న ఈ కాలంలోనూ మన శంకరవరప్రసాద్ గారుతోనూ అనిల్ రికార్డులు తిరగ రాశాడు. మరి అతని కెరీర్లో తీసిన సినిమాల రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

పటాస్: కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ 9.3 TRPతో అనిల్ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది.

సుప్రీమ్: సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ 15.4 TRPని సాధించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రాజా ది గ్రేట్: రవితేజ అంధుడిగా నటించిన ఈ ప్రయోగాత్మక కమర్షియల్ మూవీ 18.4 TRPతో రికార్డు సృష్టించింది.

F2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్: సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన హంగామాకు ప్రేక్షకులు 18.6 TRP రేటింగ్‌తో పట్టం కట్టారు.

సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ చేసిన ఈ భారీ మూవీ ఏకంగా 24.2 TRP సాధించి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

F3: ఫన్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ రెండో సినిమా 9.3 TRPని నమోదు చేసింది.

భగవంత్ కేసరి: బాలకృష్ణతో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 9.9 TRPతో మాస్ ప్రేక్షకులను మెప్పించింది.

సంక్రాంతికి వస్తున్నాం: విక్టరీ వెంకటేష్ తో మళ్ళీ జతకట్టిన ఈ సినిమా బుల్లితెరపై 18.3 TRPతో భారీ స్పందన పొందింది.

మన శంకరవరప్రసాద్ గారు: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ కూడా 14.2 TRP రేటింగ్‌తో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లింది.

బుల్లితెర బాద్‌షా..

కేవలం థియేటర్ల దగ్గర వసూళ్లు రాబట్టడమే కాదు, కుటుంబ ప్రేక్షకుల మనసు గెలవడంలో అనిల్ రావిపూడి దిట్ట. అందుకే అతని సినిమాలు టీవీలో వచ్చిన ప్రతిసారి రేటింగ్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

వినోదం, యాక్షన్, ఎమోషన్స్‌ను సరైన పాళ్లలో వడ్డించడమే అతని సినిమాల సక్సెస్ సీక్రెట్. ఈ రికార్డులు చూస్తుంటే అతన్ని టాలీవుడ్ 'హిట్ మెషీన్' అని ఎందుకు అంటారో స్పష్టమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More