టీవీలోకి మన శంకరవరప్రసాద్ గారు.. డేట్, టైమ్ ఇవే.. ఇక టీఆర్పీ రికార్డులు బ్రేక్ కావాల్సిందేనా?

మన శంకరవరప్రసాద్ గారు (mana shankara vara prasad garu) టీవీలోకి వచ్చేస్తోంది. థియేటర్లు, ఓటీటీలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ పని పట్టడానికి రెడీ అయింది. జీ తెలుగు ఛానెల్ మూవీని టెలికాస్ట్ చేయబోతోంది.

Published on: Feb 25, 2026, 14:55:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మధ్య ఏ సినిమాను అయినా ఒకేసారి అటు ఓటీటీ, ఇటు టీవీలోకి తీసుకొస్తున్న జీ నెట్‌వర్క్ ఈ మన శంకరవరప్రసాద్ గారు విషయంలో మాత్రం ఓటీటీ ప్రీమియర్ తర్వాత కాస్త ఆలస్యంగా టీవీలోకి తెస్తోంది.

టీవీలోకి మన శంకరవరప్రసాద్ గారు.. డేట్, టైమ్ ఇవే.. ఇక టీఆర్పీ రికార్డులు బ్రేక్ కావాల్సిందేనా?
టీవీలోకి మన శంకరవరప్రసాద్ గారు.. డేట్, టైమ్ ఇవే.. ఇక టీఆర్పీ రికార్డులు బ్రేక్ కావాల్సిందేనా?

మన శంకరవరప్రసాద్ గారు వరల్డ్ టీవీ ప్రీమియర్

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. థియేటర్లలోనే కాదు జీ5 ఓటీటీలోనూ రికార్డుల దుమ్ము దులిపింది. ఇప్పుడీ 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ జీ తెలుగు (Zee Telugu) ఛానెల్‌లో ఈ శనివారం అంటే ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇప్పటి వరకూ థియేటర్లలో, ఓటీటీలో చూడని వాళ్లకు ఇది మంచి అవకాశం.

ఓటీటీలో దూసుకుపోతున్న మెగా ఎంటర్‌టైనర్

మన శంకరవరప్రసాద్ గారు ఫిబ్రవరి 11నే జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 500 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినట్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇంకా జోరు తగ్గలేదు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో శంకర వర ప్రసాద్‌గా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రను పోషించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఒక ప్రముఖ పాత్రలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, క్యాథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు అత్యద్భుతమైన నటనను కనబరిచారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన అద్భుతమైన సంగీతం, సమీర్ రెడ్డి కెమెరా పనితనం, తమ్మిరాజు షార్ప్ ఎడిటింగ్ ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం జీ5 ఓటీటీలో తెలుగు సహా ఏడు భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు స్ట్రీమింగ్ అవుతోంది. టీవీలో చూడాలనుకుంటే ఈ శనివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More