మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రూ.1300 కోట్ల స్పై యాక్షన్ థ్రిల్లర్.. పది నిమిషాలు తక్కువ రన్‌టైమ్‌తో.. మరో ట్విస్ట్ కూడా
అత్యధిక వసూళ్ల హిందీ సినిమా ధురంధర్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్ల కంటే ఎక్కువ రన్ టైమ్ తో వస్తుందనుకుంటే.. పది నిమిషాలు తక్కువ కావడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.
ధురంధర్.. గతేడాది చివర్లో వచ్చి హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ఇది. రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించి, ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. గురువారం (జనవరి 29) అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూలు చేసింది.

ధురంధర్ ఓటీటీ రిలీజ్
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ధురంధర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. శుక్రవారం (జనవరి 30) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ కేటలాగ్ చెబుతోంది. అయితే దీనిపై అధికారికంగా సోషల్ మీడియా ద్వారా మాత్రం అనౌన్స్ చేయలేదు.
ఇక హిందీ కాకుండా మిగిలిన వెర్షన్ల సంగతేంటన్నది కూడా ఆ ఓటీటీ వెల్లడించలేదు. పైగా థియేటర్లలో 3 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో రాగా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం 3 గంటల 25 నిమిషాల రన్ టైమే చూపిస్తోంది. నిజానికి ఎక్స్‌టెండెడ్ కట్ ఉంటుందని వార్తలు రాగా.. ఉన్న రన్ టైమ్ కూడా తగ్గిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ధురంధర్ మూవీ విశేషాలు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలై దాదాపు రెండు నెలలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద దీని జోరు తగ్గలేదు. మొదటి ఆరు వారాల్లో రోజువారీ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు ఎనిమిదో వారంలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇండియన్ మార్కెట్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన నాలుగో సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ జాబితాలో మిగిలిన మూడు సినిమాలు దక్షిణాదికి చెందినవి కావడం, బాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం.
ఎనిమిదో వీకెండ్ లో ఈ సినిమా రూ. 2.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. జనవరి 26 (రిపబ్లిక్ డే) నాడు మరో రూ. 1.25 కోట్లు రాబట్టింది. దీంతో 53వ రోజు నాటికి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో రూ. 1002 కోట్ల గ్రాస్ (రూ. 835 కోట్ల నెట్) వసూలు చేసింది. అంతకుముందు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా షారుక్ ఖాన్ ‘జవాన్’ (రూ. 760 కోట్ల గ్రాస్) ఉండేది. ఇప్పుడు ‘ధురంధర్’ దాన్ని అధిగమించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


