YouTuber: ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యూట్యూబర్- అలా ఫొటో- ప్రార్థనల పేరుతో డ్రామాలు అంటూ మేనేజర్ ఆగ్రహం!
Youtuber Anurag Dobhal In Critical Condition: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారులో ఆత్మహత్యాయత్నం చేసి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సమయంలో మేనేజర్ రోహిత్ పాండే ఘాటుగా స్పందించారు.
హిందీ బిగ్ బాస్ 17 ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కారును డివైడర్‌కు బలంగా ఢీకొట్టారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించిన అనురాగ్ కారను సుమారు 140-150 కిలోమీటర్ల వేగంతో నడిపారు.

ఆసుపత్రి బెడ్ పై అనురాగ్.. పరిస్థితి విషమం!
ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనురాగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మార్చి 9న అనురాగ్ దోభాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యూట్యూబర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా ఫోటోను షేర్ చేశారు. ఆసుపత్రి బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అనురాగ్, తన స్నేహితుడి చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను కలిచివేస్తోంది.
కోలుకోవాలని ప్రార్థించండి
"అనురాగ్ ప్రాణాల కోసం పోరాడుతున్నారు.. ఆయన కోలుకోవాలని ప్రార్థించండి" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ భార్య రితికా చౌహాన్, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
హేటర్లపై మేనేజర్ ఆగ్రహం
అనురాగ్ దోభాల్ మేనేజర్ రోహిత్ పాండే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ అనురాగ్ గురించి పట్టించుకోని వారు, ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆయన మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రార్థనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు
"అనురాగ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ అండగా నిలవలేదు. ఇప్పుడు మాత్రం అందరూ ప్రార్థనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు" అని రోహిత్ పాండే ఘాటుగా విమర్శించారు. అనవసర పుకార్లను నమ్మవద్దని, ఈ సమయంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు.
ప్రమాదానికి ముందు మానసిక వేదన?
రోడ్డు ప్రమాదానికి కొద్దిసేపటి ముందు అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కనిపిస్తూ.. తాను చాలా ఒంటరినైపోయానని, ఫోన్ చేయడానికి కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన తన టయోటా ఫార్చ్యూనర్ కారును 140-150 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ కనిపించారు.
మానసిక వేధింపులు
గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి మానసిక వేధింపులు, చిత్రహింసలు ఎదుర్కొంటున్నానని అనురాగ్ దోభాల్ ఇదే సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.


ఒంటరిగా బతలేకపోతున్నానంటూ
అదంతా కులాంతర వివాహం చేసుకున్నందుకే అని, తన భార్య రితికాను కూడా రానివ్వడం లేదని, ఇదే చివరి వీడియో అంటూ విడుదల చేయడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. అంతేకాకుండా తన భార్య తనను విడిచిపెట్టి పోయిందని, ఒంటరిగా బతకలేకపోతున్నట్లుగా అందులో చెప్పారు యూట్యూబర్, బిగ్ బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభాల్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


