Bigg Boss:ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మాహత్యయత్నం, 150 స్పీడులో కారు-ఐసీయూలో బిగ్ బాస్ అనురాగ్-లొకేషన్ కనిపెట్టిన ఫ్యాన్స్
Bigg Boss Anurag Dobhal Suicide Attempt Live: బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్ అనురాగ్ దోభాల్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అతి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ ఆత్మహాత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ప్రాణాలు తీసుకునేందుకు అనురాగ్ ప్రయత్నించడం ఇది రెండోసారి.
బిగ్ బాస్ 17 కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) మరోసారి ఆత్మహత్యాయత్నం చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వేలాది మంది చూస్తుండగానే తన కారును వేగంగా పోనిచ్చి బారియర్‌ను ఢీకొట్టారు.

ఫాలోవర్లకు గుడ్ బై చెప్పి మరి
'ఇదే నా చివరి ప్రయాణం' అంటూ తన ఫాలోవర్లకు గుడ్ బై చెప్పి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనురాగ్ దోభాల్. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
లైవ్‌లో భయానక దృశ్యాలు
ఘజియాబాద్‌లోని మసూరి ప్రాంతంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై అనురాగ్ తన టయోటా ఫార్చ్యూనర్ కారులో వెళ్తూ లైవ్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆ సమయంలో సుమారు 80 వేల మంది ఆయనను చూస్తున్నారు.
కన్నీళ్లు పెట్టుకుంటూ అనురాగ్ దోభాల్
అనురాగ్ దోభాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. "వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వు మమ్మీ.. నాకు ప్రేమ చాలా అవసరం" అంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు తోడుగా ఎవరూ లేరని, కనీసం ధైర్యం చెప్పే మనిషి కూడా లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ ఫైనల్ డ్రైవ్
"లెట్స్ గో ఫర్ ఏ ఫైనల్ డ్రైవ్" అని చెబుతూ కెమెరాను స్పీడోమీటర్ వైపు తిప్పారు అనురాగ్ దోభాల్. అప్పుడు కారు వేగం గంటకు 140-150 కిలోమీటర్లుగా ఉంది. "ఇక సెలవు" అని అరుస్తూ కారును బారియర్‌కు ఢీకొట్టారు అనురాగ్. ఈ భయానక దృశ్యాలు చూసిన ఫాలోవర్లు షాక్‌కు గురయ్యారు.
ఐసీయూలో చికిత్స: మేనేజర్ అప్‌డేట్
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అభిమానులు పోలీసులకు సమాచారం అందించి అనురాగ్ దోభాల్ లోకేషన్‌ను కనిపెట్టారు. అనురాగ్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.
అభిమానులు నిజంగా దేవుళ్లు
"అనురాగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనను ఐసీయూకి తరలించారు. దయచేసి ఆయన కోలుకోవాలని ప్రార్థించండి. లోకేషన్ కనిపెట్టి సహాయం చేసిన అభిమానులు నిజంగా దేవుళ్లు" అని మేనేజర్ పేర్కొన్నారు. అనవసరమైన ఫోన్ కాల్స్ చేయవద్దని, సమాచారం కోసం కేవలం అఫీషియల్ అకౌంట్స్‌నే చూడాలని కోరారు.
కొద్ది రోజుల్లోనే రెండోసారి..
అనురాగ్ దోభాల్ ఇలా ఆత్మహత్యాయత్నం చేయడం కొద్ది రోజుల్లోనే ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితమే తన తల్లిదండ్రులు, తోబుట్టువులు తనను మానసిక వేదనకు, చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

కులాంతర వివాహం
తను చేసుకున్న కులాంతర వివాహం ఇంట్లో వారికి ఇష్టం లేదని, భార్య రితికను ఇంట్లోకి రానివ్వడం లేదని అనురాగ్ ఆరోపించారు. అయితే, ఆయన తమ్ముడు కలామ్ ఇంక్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తన అన్న కేవలం వ్యూస్ కోసం, సోషల్ మీడియాలో హైప్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించడం గమనార్హం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


