Bigg Boss: నన్ను చిత్రహింసలకు గురిచేశారు, నా చావుకు మా అమ్మనాన్నలే కారణం: బిగ్ బాస్ అనురాగ్- చివరి వీడియో అంటూ ఏడుపు!

Bigg Boss Anurag Dobhal: యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. తన కుటుంబ సభ్యులే తనను మానసిక వేధింపులకు గురిచేశారని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆవేదన వ్యక్తం చేస్తూ యూట్యూబ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.

Published on: Mar 5, 2026, 09:01:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) షేర్ చేసిన ఒక సుదీర్ఘ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. గత కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వివరిస్తూ, తన కుటుంబ సభ్యులపైనే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిని తన 'చివరి వీడియో'గా పేర్కొంటూ అనురాగ్ దోభాల్ కన్నీటి పర్యంతమయ్యారు.

నన్ను చిత్రహింసలకు గురిచేశారు, నా చావుకు మా అమ్మనాన్నలే కారణం: బిగ్ బాస్ అనురాగ్- చివరి వీడియో అంటూ ఏడుపు!
నన్ను చిత్రహింసలకు గురిచేశారు, నా చావుకు మా అమ్మనాన్నలే కారణం: బిగ్ బాస్ అనురాగ్- చివరి వీడియో అంటూ ఏడుపు!

బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడటం నుంచి

సుమారు రెండు గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో అనురాగ్ తన జీవితంలోని కఠిన దశలను గుర్తు చేసుకున్నారు. 14 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడటం నుంచి, కుటుంబం నుంచి ఎదురైన ఒత్తిడి వరకు అన్నింటినీ బయటపెట్టారు అనురాగ్ దోభాల్. ముఖ్యంగా తన వివాహం విషయంలో తల్లిదండ్రులు ప్రవర్తించిన తీరు తనను కృంగదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబమే నరకం చూపించింది!

"నా జీవితం ఇంత దారుణంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నా పెళ్లికి కేవలం ఆరు రోజుల ముందు మా అమ్మనాన్నలు రామని మొండికేశారు. అందరి ముందు నాతో కాళ్లు పట్టించుకున్నారు, క్షమాపణలు చెప్పించుకున్నారు. 'మేము సంతోషంగా ఉండం.. నిన్ను ఉండనివ్వం' అంటూ చిత్రహింసలు పెట్టారు" అని అనురాగ్ కన్నీరు పెట్టుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తనను, తన భార్య రితికను ఇంట్లోకి రానివ్వలేదని అనురాగ్ దోభాల్ ఆరోపించారు.

ఆస్తి కోసం తమ్ముడి వేధింపులు

తన తమ్ముడు కలాం తనను సోషల్ మీడియాలో బద్నాం చేస్తానని బెదిరించి, తన ఆస్తులను, చివరకు తన పెంపుడు కుక్కలను కూడా లాక్కున్నాడని అనురాగ్ దోభాల్ ఆరోపించారు.

నా చావుకు అమ్మ నాన్నే కారణం

"నా చావుకు మా అమ్మ, నాన్న, తమ్ముడు కలాం, శ్రేయలే కారణం. నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను. ఐదు రోజులుగా అన్నం తినలేదు. ఈ వీడియో తర్వాత నేను మీకు కనిపించకపోవచ్చు. నేను కేవలం ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను" అంటూ అనురాగ్ దోభాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

భార్య కూడా దూరం!

మరోవైపు తన భార్య రితిక కూడా తనను వదిలి వెళ్లిపోయిందని అనురాగ్ దోభాల్ తెలిపారు. "రితికా.. నిన్ను చాలామంది తప్పుదారి పట్టించారు. నువ్వు ఇతరులను నమ్మి నన్ను ఒంటరిని చేశావు. మన బిడ్డ కోసమైనా నువ్వు నిలబడతావని కోరుకుంటున్నాను" అని అనురాగ్ ఎమోషనల్ అయ్యారు.

గత ఏడాది వివాహం.. త్వరలో తండ్రి కాబోతుండగా..

అనురాగ్ దోభాల్ తన చిరకాల ప్రేయసి రితికను గతేడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సంతోషంగా ప్రకటించారు. కానీ, అంతలోనే జీవితం తలకిందులైందని, తనకిక ఏ దారీ కనిపించడం లేదని అనురాగ్ పేర్కొన్నారు.

చివరి యూట్యూబ్ వ్లాగ్

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనురాగ్ క్షేమంగా ఉండాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

కులాంతర వివాహమే కారణం

కులాంతర వివాహంతో తన తల్లిదండ్రులే చిత్రహింసలు గురి చేశారని, చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కూడా వదిలిపోయిందని, సూసైడ్ తప్పా ఇంకో దారి లేదని, అదే తనకు చివరి యూట్యూబ్ వ్లాగ్ అని ఆ వీడియోలో అనురాగ్ దోభాల్ చెప్పడం అందరిని కలిచివేస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More