OTT: ఓటీటీ రియాలిటీ షోపై యూట్యూబర్ శ్రేయ కామెంట్స్- ప్రిన్స్ రికమండేషన్ ఉంటేనే ఎంట్రీ- గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటూ!
ఫిబ్రవరి 1న గ్రాండ్‌గా మొదలైన 'ది 50' రియాలిటీ షో అప్పుడే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ షోలో కంటెస్టెంట్లను ఎలా ఎంపిక చేశారనే దానిపై యూట్యూబర్ శ్రేయ కల్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మరి శ్రేయ కల్రా ఏం కామెంట్స్ చేసిందనే వివరాల్లోకి వెళితే..!
బుల్లితెరపై సరికొత్త ప్రయోగానికి తెరలేపుతూ వచ్చిన రియాలిటీ షో 'ది 50'. గత బిగ్ బాస్, రోడీస్, స్ల్పిట్స్ విల్లా పాల్గొన్న కంటెస్టెంట్లతో నిండిపోయిన ది 50 షో కేవలం డ్రామాతోనే కాదు.. ఇప్పుడు కాస్టింగ్ వివాదంతోనూ వార్తల్లో నిలుస్తోంది. ఈ షో నుంచి మొదటి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన వన్షజ్ సింగ్‌తో యూట్యూబర్ శ్రేయ కల్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

ప్రిన్స్ సిఫార్సు ఉంటేనే ఎంపిక?
ది 50 షోలో పాల్గొనే అవకాశం తనకు కూడా వచ్చిందని యూట్యూబర్ శ్రేయ కల్రా వెల్లడించారు. "షో మేకర్స్ నాతో మాట్లాడినప్పుడు.. నీ స్నేహితులను కూడా తీసుకురావచ్చు, కానీ ముందే వారి పేర్లు చెప్పాలని అన్నారు. ఆ పేర్లను బట్టి ఎవరిని తీసుకోవాలో వారు నిర్ణయిస్తారు" అని శ్రేయ కల్రా పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రస్తుతం షోలో ఉన్న కంటెస్టెంట్లలో చాలామంది ప్రిన్స్ నరులా సిఫార్సుతోనే వచ్చారని శ్రేయ కల్రా ఆరోపించారు. దీనిపై వన్షజ్ సింగ్ స్పందిస్తూ.. "ఇది వంద శాతం నిజం. ప్రిన్స్ రికమండ్ చేయకపోతే అక్కడ ఉన్న సగం మందికి పనే దొరకదు" అని వ్యాఖ్యానించారు.
నెటిజన్ల ఫైర్: ‘ఇదొక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్’
ఈ వీడియో క్లిప్ రెడ్డిట్ (Reddit) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిని 'గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్' అని, 'ఎమ్ఎల్ఎమ్ (MLM) స్కీమ్' అని ఎద్దేవా చేస్తున్నారు. "అందుకేనేమో అక్కడ ఉన్న సగం మంది పేర్లు మాకు తెలియడం లేదు.. అంతా మాస్ రిక్రూట్‌మెంట్‌లా ఉంది" అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
అసలేమిటి ఈ 'ది 50'?
రియాలిటీ టెలివిజన్ రంగంలో మార్పు తెస్తామని ప్రకటించిన ఈ షోలో కరణ్ పటేల్, రిధి డోగ్రా, ప్రిన్స్ నరులా, ఉర్వశి ధోలాకియా వంటి సీనియర్ నటులతో పాటు ఫైజు షేక్, అద్నాన్ షేక్, లవకేష్ కటారియా వంటి పాపులర్ యూట్యూబర్లు కూడా ఉన్నారు. నిక్కీ తంబోలి, రజత్ దలాల్ వంటి రియాలిటీ షో రెగ్యులర్ కంటెస్టెంట్లు కూడా ఇందులో సందడి చేస్తున్నారు.
ఒక పెద్ద రాజభవనంలో ఉండే కంటెస్టెంట్లు, ప్రతిరోజూ టాస్కులు గెలిచి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి. 'ది లయన్' అనే ఒక అజ్ఞాత శక్తి ఈ క్రీడను నడిపిస్తుంది. ప్రస్తుతం ది 50 షో జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు కలర్స్ ఛానెల్‌లో ది 50 షో టీవీ ప్రీమియర్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


