Actor Sivaji: రాత్రి 2, 3 గంటలే నిద్రపోయేవాన్ని, ఆ పాప లేకుంటే సినిమా చేసేవాన్ని కాదు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Actor Sivaji About Dhandoraa Gaddar Awards: బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి కీలక పాత్రలు పోషించిన సినిమా దండోరా. ఇటీవల ప్రకటించిన గద్దర్ 2025 అవార్డ్స్‌లలో దండోరా పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 9, 2026, 17:01:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాత్రి 2, 3 గంటలే నిద్రపోయేవాన్ని, ఆ పాప లేకుంటే సినిమా చేసేవాన్ని కాదు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్
రాత్రి 2, 3 గంటలే నిద్రపోయేవాన్ని, ఆ పాప లేకుంటే సినిమా చేసేవాన్ని కాదు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

దండోరా థ్యాంక్స్ మీట్

ఈ చిత్రంలో బిగ్ బాస్ శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం (మార్చి 8) నాడు చిత్ర యూనిట్ థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ దండోరా థాంక్యూ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ .. "మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్‌ గారికి అవార్డు రావడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

తెలుగు వాళ్ల ప్రతిభ చాటి చెప్పే

"నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీగారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది" అని నటుడు శివాజీ తెలిపారు.

"ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడ్ని కాదు" అని శివాజీ వెల్లడించారు.

ఇంకా చాలా దూరం వెళ్తుంది

"నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. దండోరా మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాను" అని బిగ్ బాస్ శివాజీ ఆశించారు.

నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ .. "‘దండోరా’ సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు గారికి, నాగవంశీ గారికి థాంక్స్. మాకు ముందు నుంచీ అండగా నిలిచిన మీడియాకి థాంక్స్" అని అన్నారు.

గద్దర్ అన్న పాటలు వేనివాన్ని

మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ .. "ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది" అని చెప్పారు.

"‘దండోరా’ అద్భుతమైన కథ. ఇలాంటి కథను నా వద్దకు తీసుకు వచ్చిన మురళీకి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More