OTT Thrillers: ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే 7 బెస్ట్ థ్రిల్లర్ సిరీస్‌లు- షాకింగ్ ట్విస్టులతో- అన్నీ ఒకేదాంట్లో చూసేయొచ్చు!
Best 7 OTT Thriller Web Series On Amazon Prime: ఓటీటీ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఊపిరి బిగబట్టే ఉత్కంఠ, ఊహించని మలుపులతో సాగే కథలు ఓటీటీ తెరపై కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ 7 థ్రిల్లర్ సిరీస్‌లపై లుక్కేద్దాం.
Amazon Prime OTT Best Thriller Web Series: కథలో వేగం కంటే, ఆ కథ ప్రేక్షకుడిని ఎంతగా ఇన్వాల్వ్ చేసిందనేదే ఓటీటీ థ్రిల్లర్స్ విజయాన్ని నిర్ణయిస్తుంది. కేవలం షాకింగ్ ట్విస్టులు మాత్రమే కాకుండా, పాత్రల మధ్య సాగే మానసిక సంఘర్షణ, రహస్యాలు, వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉంటే ఆ సిరీస్‌ను వదలడం ఎవరికైనా కష్టమే.

7 బెస్ట్ ఓటీటీ థ్రిల్లర్స్
మీరు క్రైమ్, సైకలాజికల్, హారర్ తదితర ఎలిమెంట్స్‌తో నిండి ఉన్న థ్రిల్లర్స్ కోసం వెతుకుతుంటే అమెజాన్ ప్రైమ్‌లోని ఈ బెస్ట్ 7 ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌లు కచ్చితంగా చూడాల్సిందే. షాకింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే ఆ 7 బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు అన్నింటిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడొచ్చు. మరి అవేంటో లుక్కేద్దాం.
1. ఖౌఫ్ (Khauf)
ఇది కేవలం ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ మాత్రమే కాదు. మనిషి మెదడులోని భయాలను తట్టిలేపే సైకలాజికల్ డ్రామా కూడా. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి వచ్చి హాస్టల్‌లో నివసించే మధు (మోనికా పన్వర్) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె గతం ఆమెను వెంటాడుతుంటే, ఆ హాస్టల్ గదిలో జరిగే వింత పరిణామాలు ప్రేక్షకుడిని భయపెడతాయి. నెమ్మదిగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఊహించని మలుపులు తీసుకోవడం దీని ప్రత్యేకత.
2. యంగ్ షెర్లాక్ (Young Sherlock)
షెర్లాక్ హోమ్స్ అనగానే మనకు ఒక తెలివైన, పరిణతి చెందిన డిటెక్టివ్ గుర్తొస్తాడు. కానీ, ఈ ఓటీటీ సిరీస్ హోమ్స్ యువకుడిగా ఉన్నప్పుడు ఎంత మొండిగా, ఆవేశంగా ఉండేవాడో చూపిస్తుంది. ఆక్స్‌ఫర్డ్ నేపథ్యంలో సాగే ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో హోమ్స్ (హీరో ఫైన్స్ టిఫిన్), జేమ్స్ మోరియార్టీ (డోనాల్ ఫిన్) మధ్య ఏర్పడే వింతైన అనుబంధం ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ.
3. ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)
మిచెల్ ఫ్రాన్సెస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఒక తల్లి అనుమానం ఏ స్థాయికి చేరుతుందో చూపిస్తుంది. తన కొడుకు ప్రేమలో పడ్డ యువతి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తల్లి లారా (రాబిన్ రైట్) అనుమానిస్తుంది. ఈ క్రమంలో ఆమె చేసే పరిశోధన, ఆ యువతి గతం.. రెండూ ఓటీటీ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి.
4. హన్నిబాల్ (Hannibal)
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్లలో ఇదొక మాస్టర్ పీస్. విల్ గ్రాహం అనే ప్రొఫైలర్, డాక్టర్ హన్నిబాల్ లెక్టెర్ అనే సీరియల్ కిల్లర్ మధ్య సాగే మైండ్ గేమ్ ఇది. హన్నిబాల్ లెక్టెర్ తన నిజస్వరూపాన్ని దాచిపెట్టి ఎలా మభ్యపెడతాడు, విల్ గ్రాహం మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాడు అనేది అత్యంత స్టైలిష్‌గా, అంతే భయంకరంగా చూపించారు.
5. ది నైట్ మేనేజర్ (The Night Manager)
టామ్ హిడిల్‌స్టన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ వెబ్ సిరీస్ గూఢచారి (Espionage) కథాంశంతో సాగుతుంది. ఒక లగ్జరీ హోటల్ మేనేజర్, ఒక అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఎలా రంగంలోకి దిగాడనేది ఇక్కడ హైలైట్. ప్రతీకారం, మోసం, ప్రేమ.. ఇలా అన్ని అంశాలు మేళవించిన ఈ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్.
6. సుడల్: ది వోర్టెక్స్ (Suzhal: The Vortex)
తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగే ఈ ఇండియన్ ఓటీటీ థ్రిల్లర్ అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న అగ్ని ప్రమాదం, ఒక అమ్మాయి అదృశ్యం కేసు.. ఎలా పెద్ద కుంభకోణానికి దారితీసిందనేది కథ. సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, వ్యవస్థలోని అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. రెండో సీజన్ కూడా అంతే ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది.
7. పాతాళ్ లోక్ (Paatal Lok)
సమాజంలోని చీకటి కోణాలను పచ్చిగా చూపించిన వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్'. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హాథీ రామ్ చౌదరి కళ్లతో ఈ లోకాన్ని చూస్తాం. సమాజం మూడు విభాగాలుగా (స్వర్గం, భూలోకం, పాతాళం) ఎలా విడిపోయిందో ఈ ఓటీటీ సిరీస్ చర్చిస్తుంది. ఇందులో హీరోలు ఉండరు, కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడే వ్యక్తులు మాత్రమే ఉంటారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


