OTT Horror: ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్- ఎక్కడంటే?

OTT Psychological Horror Thriller Release Today: ఓటీటీలోకి ఇవాళ నేరుగా సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఇఫ్ విషెస్ కుడ్ కిల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కోరికలు తీర్చి ప్రాణాలు తీసే ఓ మొబైల్ యాప్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మరి ఇఫ్ విషెస్ కుడ్ కిల్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 24, 2026, 21:40:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror Thriller Release Today: కొరియన్ డ్రామాలకు (K-Dramas) తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్ జోనర్లను మన ఓటీటీ ఆడియెన్స్ బాగా ఆదరిస్తారు. సరిగ్గా ఇదే పల్స్‌ను పట్టుకుంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి కె డ్రామా హారర్ థ్రిల్లర్స్‌ను వదులుతున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- కోరికలు తీర్చి ప్రాణాలు తీసే మొబైల్ యాప్- ఎక్కడంటే?

యంగ్ అడల్ట్ హారర్ సిరీస్‌

తాజాగా ఓటీటీలోకి మొట్టమొదటి కొరియన్ యంగ్ అడల్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌గా 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్' వచ్చేసింది. ఇది కేవలం దెయ్యాల కథ కాదు. సాంకేతికతకు భయంకరమైన మానవాతీత శక్తులు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించే ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ సిరీస్‌లో హారర్, మిస్టరీ, సైకలాజికల్ అంశాలతో పాటు ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్నాయి.

సీరిన్ హైస్కూల్.. గిరిగో (Girigo) యాప్ మిస్టరీ

ఇఫ్ విషెస్ కుడ్ కిల్ కథ విషయానికి వస్తే.. సీరిన్ అనే హైస్కూల్‌లో చదివే కొందరు విద్యార్థులకు 'గిరిగో' అనే ఒక వింత యాప్ పరిచయమవుతుంది. తమ మనసులోని గాఢమైన కోరికను ఒక వీడియో తీసి అప్‌లోడ్ చేస్తే చాలు, అది నెరవేరుతుంది. వినడానికి ఇది చాలా సరదాగా అనిపించినా, అక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది.

కోరిక తీరిన మరుక్షణం నుంచే సదరు విద్యార్థికి ప్రాణాంతకమైన 'కౌంట్ డౌన్' మొదలవుతుంది. అంటే, ముందు కోరికలు తీర్చి ఆ తర్వాత వారి ప్రాణాలు తీస్తుంది ఆ ప్రాణాంతక మొబైల్ యాప్ గిరిగో. టెక్నాలజీ సాయంతో ప్రాణాలు తీసే ఈ యాప్ వెనుక ఉన్న శక్తులేంటి? విద్యార్థులు ఆ యాప్ ఉచ్చు నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే ఈ 8 ఎపిసోడ్ల ఇఫ్ విషెస్ కుడ్ కిల్ ఓటీటీ సిరీస్ సారాంశం.

యంగ్ నటీనటులు - పాత్రల తీరుతెన్నులు

జియోన్ సో-యంగ్: సె-ఆ అనే అథ్లెట్ పాత్రలో కనిపిస్తుంది. యాప్ చిక్కుముడిని విప్పే క్రమంలో ఈమె పాత్ర కీలకంగా ఉంటుంది.

కాంగ్ మి-నా: స్కూల్‌లో పాపులర్ స్టూడెంట్ అయిన నా-రి పాత్రలో మెప్పించనుంది.

బేక్ సన్-హో: సె-ఆ ప్రియుడు గెన్-వూగా నటించాడు.

హ్యూన్ వూ-సిక్: టెక్నాలజీపై పట్టున్న హా-జూన్ పాత్రలో, ఆ శాపగ్రస్త యాప్‌ను ఆపడానికి ప్రయత్నించే కుర్రాడిగా కనిపిస్తాడు.

ఎక్కడ చూడాలి?

అయితే, ఈ ఓటీటీ సిరీస్ నేరుగా ఇవాళ (ఏప్రిల్ 24) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి ఇఫ్ విషెస్ కుడ్ కుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగు తప్పా మిగతా ఎన్నో భాషల్లో, సబ్ టైటిల్స్‌తో ఇఫ్ విషెస్ కుడ్ ఓటీటీ రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఇఫ్ విషెస్ కుడ్ కిల్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేడు (ఏప్రిల్ 24) మధ్యాహ్నాం 1:30 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. వారం వారం ఎపిసోడ్ల కోసం ఎదురుచూసే పని లేకుండా, అన్ని ఎపిసోడ్లను ఒకేసారి విడుదల చేశారు. వీకెండ్‌లో అదిరిపోయే ఓటీటీ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More