Zee5 OTT: ఓటీటీలోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ డాక్యుమెంటరీ- స్ట్రీమింగ్ అడ్డుకున్న కేంద్రం- జీ5కి ఎదురుదెబ్బ- ఎందుకంటే?
Center Advice Zee5 OTT Release Lawrence Of Punjab: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి చేయించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ లారెన్స్ ఆఫ్ పంజాబ్ స్ట్రీమింగ్‌ను కేంద్రం అడ్డుకుంది. ఈ నిర్ణయంతో జీ5 ఓటీటీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
Center Advice Zee5 OTT Release Lawrence Of Punjab: పంజాబ్ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ సంస్కృతి, నేర సామ్రాజ్యాల విస్తరణ అనేది అత్యంత సున్నితమైన అంశం. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎదుగుదలను చూపిస్తూ రూపొందించిన ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'. ఏప్రిల్ 27 న లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ రిలీజ్ కావాల్సి ఉంది.

ఓటీటీ సిరీస్ విడుదలయితే
అయితే, ఈ ఓటీటీ సిరీస్ విడుదలయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పంజాబ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను గొప్పగా చూపించడం వల్ల యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని వారు కేంద్రానికి నివేదించారు. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5కి ఈ సిరీస్ విడుదల చేయవద్దని అడ్వైజరీ జారీ చేసింది.
కోర్టుకెక్కిన కాంగ్రెస్ నేత.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
ఈ ఓటీటీ డాక్యూ సిరీస్‌పై పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉన్న ఈ షోను నిషేధించాలని ఆయన కోరారు.
శుక్రవారం (ఏప్రిల్ 24) ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో, కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ ఇప్పటికే జీ5 ఓటీటీ సంస్థకు పంపిన ఆదేశాల కాపీని కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తన అభ్యంతరాలు నెరవేరాయని పిటిషనర్ తెలపడంతో కోర్టు ఈ కేసును ముగించింది.
గ్యాంగ్‌స్టర్ల వైభవీకరణపై కేంద్రం ఆంక్షలు
నేరగాళ్లను హీరోలుగా చూపిస్తూ, వ్యవస్థీకృత నేరాలను రొమాంటిసైజ్ చేయడం (గ్లోరిఫై చేయడం) వల్ల సమాజానికి చెడు సందేశం వెళ్తుందని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. "గ్యాంగ్‌స్టర్లకు సంబంధించిన అంశాలు పంజాబ్‌లో చాలా సెన్సిటివ్. ఇలాంటి కంటెంట్ పబ్లిక్ రియాక్షన్స్‌ను రెచ్చగొట్టేలా ఉంటే, అది శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తుంది" అని ఐఅండ్ బీ (I&B) మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అసలు 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'లో ఏముంది?
పోలీసు యంత్రాంగం నేరస్థులపై చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి ఓటీటీ సిరీస్‌లు నీరుగారుస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. కాగా, ప్రపంచ ప్రసిద్ధ క్లాసిక్ సినిమా 'లారెన్స్ ఆఫ్ అరేబియా' టైటిల్‌ను స్ఫురింపజేసేలా ఈ సిరీస్‌కు పేరు పెట్టారు.
స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి నేర సామ్రాజ్యానికి లారెన్స్ బిష్ణోయ్ ఎలా ఎదిగాడనేది ఇందులో చూపించాలనుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేయడం, మ్యూజిక్ ఇండస్ట్రీ, మీడియా ద్వారా ఎలా గుర్తింపు పొందాడు అనే కోణంలో ఈ డాక్యూ-సిరీస్‌ను రూపొందించారు.
సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాలు సమాజానికి ముప్పు అని భావించిన ప్రభుత్వం దీనిపై తాత్కాలికంగా వేటు వేసింది. కాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలను కూడా లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు సమాచారం. అయితే, కేంద్రం ఈ సిరీస్‌ను అడ్డుకోవడంతో జీ5 ఓటీటీకి ఒకింత ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. లారెన్స్ ఆఫ్ పంజాబ్ సిరీస్ ఎందుకు నిలిపివేయబడింది?
ఈ సిరీస్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని ఇది ప్రోత్సహిస్తుందని పంజాబ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ఆపివేసింది.
2. ఈ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావాల్సింది?
ఈ డాక్యూ-సిరీస్ ఏప్రిల్ 27న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5)లో విడుదల కావాల్సి ఉంది.
3. దీనిపై హైకోర్టులో ఎవరు కేసు వేశారు?
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


