OTT Show: ఓటీటీ షోలో లక్ష రూపాయలు గెలుచుకున్న రియల్ పోలీస్- ఏ విధంగా అంటే?
UP Police Participated In Indias Got Latent 2: యూట్యూబ్ సెన్సేషన్ సమయ్ రైనా హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఓటీటీ రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 2లో ఊహించని పరిణామం ఎదురైంది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఖాకీ యూనిఫాంతో నేరుగా వేదికపైకి రావడంతో షో నిర్వాహకులతో పాటు జడ్జీలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
UP Police Participated In Indias Got Latent 2: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ఓటీటీ కామెడీ రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) సీజన్ 2 సరికొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వింత ప్రతిభతో ఓటీటీ షోకి
తాజాగా విడుదలైన రెండో ఎపిసోడ్‌లో ఒక విచిత్రమైన, నవ్వులు పూయించే సంఘటన జరిగింది. సాధారణంగా ఈ ఓటీటీ షోకి వింత వింత ప్రతిభ ఉన్న అండర్ గ్రౌండ్ కళాకారులు వస్తుంటారు. కానీ, ఈసారి ఏకంగా ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ ఖాకీ యూనిఫామ్ వేసుకుని, పూర్తి ఆయుధాలతో స్టేజ్ మీదకు రావడంతో హోస్ట్ సమయ్ రైనాతో పాటు ప్యానెలిస్ట్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ ఓటీటీ షో ఫార్మాట్ ప్రకారం కంటెస్టెంట్లు తమ హిడెన్ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ తమకు తాము మార్కులు ఇచ్చుకోవాలి. జడ్జీలు ఇచ్చే మార్కులతో అవి మ్యాచ్ అయితే ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. ఈ క్రమంలో ఒక యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎంట్రీ ఇవ్వడం, చివరకు లక్ష రూపాయలు గెలుచుకోవడం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
స్టేజ్ పైనే క్లాస్ పీకిన కానిస్టేబుల్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కపిల్ దింకర్ ఖాకీ దుస్తుల్లో వేదికపైకి రాగానే జడ్జీల ముఖాల్లో రంగులు మారాయి. రావడం రావడమే సమయ్ రైనాను ఉద్దేశించి ఆయన ఒక రేంజ్‌లో పంచ్ వేశారు. "మళ్లీ మొదలుపెట్టారా ఈ షో? గతంలో ఒకసారి మూయించాం కదా, బుద్ధి రాలేదా?" అంటూ కపిల్ సరదాగా అనడంతో సెట్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
మొదట ఎవరో నటుడు ప్రాంక్ చేస్తున్నాడని భ్రమపడ్డ సమయ్ రైనా.. "యూనిఫామ్ వేసుకుని స్టేజ్ ఎక్కకూడదు బ్రదర్, రూల్స్ ఒప్పుకోవు" అని కాస్త కంగారుగానే హెచ్చరించాడు. కానీ, తాను నిజమైన పోలీస్ కానిస్టేబుల్‌నని కపిల్ స్పష్టం చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
పొట్టకూటి కోసం పోలీస్.. ఆత్మతృప్తి కోసం పాటలు
తన నేపథ్యం గురించి కపిల్ చెబుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను 2021లో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరానని చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణమని, అయితే తల్లి కోరిక కోసమే ఖాకీ చొక్కా తొడిగానని వివరించారు.
"నేను ఒక సింగర్, లిరిసిస్ట్, కంపోజర్. సంగీతం నా ఆత్మకు తృప్తిని ఇస్తుంది. కేవలం బిల్లులు కట్టడానికి, బతకడానికి మాత్రమే నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను" అని కపిల్ దింకర్ పేర్కొన్నారు.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెషనల్‌గా పాటలు పాడుకోవడానికి అధికారిక అనుమతి పొందిన ఏకైక కానిస్టేబుల్ తానేనని గర్వంగా చెప్పారు. సంగీతం కోసం పగటిపూట సమయం కేటాయించి, రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటానని తెలిపారు. ఆయన కేవలం పాటలు మాత్రమే కాదు, ఇప్పటికే మూడు పుస్తకాలు రాశారు. ప్రస్తుతం మరో ఎనిమిది పుస్తకాలపై పనిచేస్తున్నారు.
జడ్జీల భయం.. లక్ష రూపాయల బహుమతి
షోలో కపిల్ తన సొంత గొంతుతో రాసిన ఒక అద్భుతమైన పాటను పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆయన టాలెంట్‌కు ఫిదా అయిన ప్యానెలిస్ట్స్ అందరూ పదికి పది మార్కులు వేశారు. కపిల్ కూడా తనకు తాను పది మార్కులు ఇచ్చుకోవడంతో స్కోర్ పక్కాగా మ్యాచ్ అయింది. దీంతో ఆయన ఏకంగా లక్ష రూపాయల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కమెడియన్ హర్ష్ లింబాచియా భయపడుతూనే ఒక జోక్ వేశారు. "మేము ఎప్పుడైనా ఏదైనా నేరం చేస్తే మమ్మల్ని పట్టుకోవడానికి మీరే రండి సార్" అని హర్ష్ అనగా.. "అసలు మీరు నేరాలు ఎందుకు చేస్తారు?" అని కపిల్ స్పాంటేనియస్‌గా కౌంటర్ ఇచ్చారు. యూపీలో క్రైమ్ రేట్ గురించి సమయ్ అడిగిన ప్రశ్నకు.. తమ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అద్భుతంగా పనిచేస్తున్నామని కపిల్ ధీటుగా సమాధానమిచ్చారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
చివరలో సమయ్ రైనా కానిస్టేబుల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. "భారతీయ పోలీస్ శాఖ నుంచి మా షోకి ఒకరు రావడం చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల మా షో క్రెడిబిలిటీ మరింత పెరిగింది" అని ముగించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా, ఇండియాస్ గాట్ లాటెంట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో ఇండియన్ ట్రంప్‌గా పిలవబడే అవినాష్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌పై జోకులు వేయడం నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


