OTT Heroine: ఇండియాలో కామెడీ రోల్స్, డ్యాన్స్ చేయాలనుందన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్- ఎందుకంటే?

Millie Bobby Brown On Indian Comedy Movies: నెట్‌ఫ్లిక్స్ సెన్సేషన్ 'స్ట్రేంజర్ థింగ్స్' ఫేమ్ మిల్లీ బాబీ బ్రౌన్ త్వరలోనే 'ఎనోలా హోమ్స్ 3' చిత్రంతో ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మిల్లీ భారతీయ చిత్రాల్లో నటించడంపై, ఇక్కడి పాటలకు డ్యాన్స్ చేయడంపై తన మనసులోని మాటను బయటపెట్టింది.

Published on: Jun 27, 2026, 11:00:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Millie Bobby Brown On Indian Comedy Movies: సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్'స్ట్రేంజర్ థింగ్స్'లో 'ఇలెవెన్' అనే పవర్ ఫుల్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ మిల్లీ బాబీ బ్రౌన్ తాజాగా భారతీయ సినిమాపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.

ఇండియాలో కామెడీ రోల్స్, డ్యాన్స్ చేయాలనుందన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్- ఎందుకంటే? (REUTERS)
ఇండియాలో కామెడీ రోల్స్, డ్యాన్స్ చేయాలనుందన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్- ఎందుకంటే? (REUTERS)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్ర పోషించిన మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఎనోలా హోమ్స్ 3' (Enola Holmes 3) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మిల్లీ బాబీ బ్రౌన్ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హిందీ సినిమాల్లో నటించడమే కాకుండా, ఇక్కడి పాటలకు మాస్ స్టెప్పులు వేయడానికి కూడా తాను రెడీ అని ప్రకటించి ఇండియన్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తింది. ప్రస్తుతం హాలీవుడ్ నటీనటులు భారతీయ మార్కెట్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' వంటి చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు గ్లోబల్ లెవెల్‌కు వెళ్లిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్టార్లకు మన కల్చర్, సినిమాలపై క్రేజ్ పెరుగుతోంది.

డ్యాన్స్ అంటే ప్రాణం.. ఇండియా నా బకెట్ లిస్ట్‌లో ఉంది!

ఈ క్రమంలోనే వెరైటీ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిల్లీ బాబీ బ్రౌన్ ఇండియన్ చిత్రాల రంగప్రవేశం గురించి మాట్లాడింది. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు మిల్లీ ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చింది.

"కచ్చితంగా నటిస్తాను. నేను దేనికీ లేదు అని చెప్పను. నా బకెట్ లిస్ట్‌లో ఇండియా ఉంది. అక్కడికి వెళ్లాలని నాకు చాలా ఆశగా ఉంది. హిందీలో ఎలాంటి రోల్స్ చేయడానికైనా నేను సిద్ధమే. నాకు కామెడీ రోల్స్ చేయడమంటే ఇష్టం, ఎందుకంటే నేను చాలా ఫన్నీగా ఉంటాను" అని మిల్లీ బాబీ బ్రౌన్ వెల్లడించింది.

హిందీ సినిమాల్లో ఉండే కలర్‌ఫుల్ డ్యాన్స్ నెంబర్లలో స్టెప్పులు వేస్తారా అని అడగగా.. తనకి డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని, అవకాశం వస్తే అస్సలు వదులుకోనని నవ్వుతూ సమాధానమిచ్చింది.

'ఎనోలా హోమ్స్ 3' యాక్షన్ సీన్స్.. గన్‌ పట్టుకోవడంపై

జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్న ఎనోలా హోమ్స్ 3వ భాగంలో యాక్షన్ సన్నివేశాల గురించి కూడా మిల్లీ మాట్లాడింది. ఈ ఫ్రాంచైజీలో మొదటి రెండు భాగాల్లో శారీరక శ్రమతో కూడిన భారీ ఫైట్స్ చేసినట్లు చెప్పిన మిల్లీ, ఈసారి మాత్రం కథలో కొన్ని ఆసక్తికర మార్పులు ఉన్నాయని తెలిపింది.

"మొదటి రెండు పార్టుల్లో ఎనోలా తన సొంత శారీరక బలాన్ని నమ్ముకుని ఫైట్స్ చేసింది. అందుకే వెపన్స్ వాడటానికి నేను మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఈ మూడో భాగంలో ఎనోలా తన రక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలు, టూల్స్ వాడుతుంది. ఈ కొత్త తరహా యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది" అని మిల్లీ పేర్కొంది.

ప్రొడ్యూసర్‌గానూ మారిన యంగ్ డిటెక్టివ్

విక్టోరియన్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఎనోలా హోమ్స్ ఓటీటీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ప్రసిద్ధ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (హెన్రీ కావిల్) చెల్లెలిగా మిల్లీ బాబీ బ్రౌన్ చేసే ఇన్వెస్టిగేషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

నాన్సీ స్ప్రింగర్ రాసిన పాపులర్ నవలల ఆధారంగా హ్యారీ బ్రాడ్‌బీర్ ఈ చిత్రాలను డైరెక్ట్ చేశారు. 2020లో మొదటి భాగం, 2022లో రెండో భాగం విడుదల కాగా, ఇప్పుడు మూడో భాగం జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది.

గాడ్జిల్లా చిత్రాలతో

చిన్న వయసులోనే మిల్లీ ఈ చిత్రానికి నటిగానే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. గాడ్జిల్లా చిత్రాలతోనూ మెప్పించిన ఈ హాలీవుడ్ స్టార్‌ను త్వరలోనే బాలీవుడ్ తెరపై చూసే అవకాశం దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More