OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 5 సినిమాలు-ఒకేదాంట్లో 3, తెలుగులో 2 ఇంట్రెస్టింగ్-నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ ఈటీవీ విన్‌లో!

OTT Release Movies Today: ఓటీటీలో వీకెండ్‌కు ముందే డిజిటల్ వినోద ప్రియులకు పండగ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలతో పాటు ఈటీవీ విన్‌లలో ఇవాళ 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒకేదాంట్లో 3 ఓటీటీ రిలీజ్ కాగా వీటన్నింటిల్లో 2 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

Published on: May 21, 2026, 14:30:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Today: డిజిటల్ వినోద ప్రియులను అలరించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. వారాంతానికి ముందే, ఇవాళ అంటే మే 21 గురువారం నాడు పలు క్రేజీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 5 సినిమాలు-ఒకేదాంట్లో 3, తెలుగులో 2 ఇంట్రెస్టింగ్-నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ ఈటీవీ విన్‌లో!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 5 సినిమాలు-ఒకేదాంట్లో 3, తెలుగులో 2 ఇంట్రెస్టింగ్-నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ ఈటీవీ విన్‌లో!

గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లతో పాటు మన ప్రాంతీయ కంటెంట్‌ను అందిస్తున్న 'ఈటీవీ విన్'లలో యాక్షన్, హారర్, కామెడీ, స్పోర్ట్స్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. మరి టుడే ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఈటీవీ విన్‌లో తెలుగు క్రైమ్ కామెడీ 'ఉత్తుత్త హీరోలు'

తెలుగు ప్రేక్షకులకు ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది 'ఉత్తుత్త హీరోలు'. హోమ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీలో ఈ చిత్రం మే 21 నుంచి అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదొక పక్కా తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠ రేపే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో ఇదొక మంచి ఛాయిస్ కానుంది.

అమెజాన్ ప్రైమ్‌లో స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

కార్ రేసింగ్, స్పోర్ట్స్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక ప్రత్యేక చిత్రాన్ని తీసుకొచ్చింది. ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ 'కైల్ లార్సెన్ వర్సెస్ ది డబుల్' (Kyle Larson x The Double) మే 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రేసింగ్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాళ్లను ఒక రేసర్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ డాక్యుమెంటరీ సాగుతుంది. యాక్షన్, అడ్రినలిన్ రష్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

నెట్‌ఫ్లిక్స్‌లో ఒక్కదాంట్లోనే మూడు

అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మే 21న ఒకేసారి మూడు భిన్నమైన హాలీవుడ్ ప్రాజెక్టులను తీసుకొచ్చింది. హాలీవుడ్ టీన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ వన్ ట్రీ హిల్ (One Tree Hill) యువతను ఆకట్టుకోవడానికి వస్తోంది. ప్రేమాభిమానాలు, క్రీడా నేపథ్యంతో సాగే ఎమోషనల్ డ్రామా ఇది.

సైన్స్ ఫిక్షన్ హారర్ జోనర్‌ను ఇష్టపడే వారి కోసం 'ది బోరోగ్స్' (The Boroughs) సిద్ధమైంది. ఊహించని మలుపులు, భయానక సన్నివేశాలతో సాగే ఈ ఓటీటీ సిరీస్ హారర్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవడం ఇంట్రెస్టింగ్ విషయం.

తెలుగులో 2 ఇంట్రెస్టింగ్

ఇక ఫుట్‌బాల్ అభిమానుల కోసం కొలంబియన్ స్టార్ ప్లేయర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ 'జేమ్స్' (James) సీజన్-1 నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళే ఓటీటీ రిలీజ్ అయింది. ఇలా ఇవాళ ఓటీటీలోకి వచ్చిన 5 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 3 రిలీజ్ అవడం విశేషం. ఇక వీటన్నింట్లో తెలుగులో 2 మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More