Prime MX Player OTT: ఓటీటీ రంగంలో పెను మార్పు- అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎమ్ఎక్స్ ప్లేయర్ విలీనం- కలిగే ప్రయోజనాలు ఇవే!
OTT Platforms MX Player Unification Amazon Prime: ఓటీటీ రంగంలో మంచి పెనుమార్పు చోటుచేసుకోనుంది. దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ అయిన ప్రైమ్ వీడియో.. మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌ను తనలో విలీనం చేసుకునే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. దీంతో కలిగే ప్రయోజనాలపై లుక్కేద్దాం.
Amazon Prime MX Player OTT Unification: భారతీయ ఓటీటీ రంగంలో పెను మార్పు చోటుచేసుకోనుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో, తన అనుబంధ సంస్థ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player)ను పూర్తిగా తనలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతీయ ప్రేక్షకులకు అతిపెద్ద కంటెంట్ ఓటీటీ లైబ్రరీ అందుబాటులోకి రానుంది.

వినోద సామ్రాజ్యాల ఏకీకరణ
రెండు ఏళ్ల క్రితం ఎమ్ఎక్స్ ప్లేయర్‌ను అమెజాన్ దక్కించుకున్నప్పటి నుంచే ఈ మార్పులకు పునాది పడింది. తాజాగా గురువారం (మే 7) నాడు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ ఓటీటీ విలీనాన్ని ధృవీకరించింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లు ఒకే గొడుగు కిందకు రావడం వల్ల ఉచిత, పెయిడ్ కంటెంట్ రెండూ ఒకే చోట లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటీటీ ప్రేక్షకుడికి నాణ్యమైన వినోదాన్ని అందించే 'వన్-స్టాప్ డెస్టినేషన్'గా ప్రైమ్ వీడియో అవతరించనుంది.
ఈ విలీనం గురించి ప్రైమ్ వీడియో ఆసియా-పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. "మా ప్రేక్షకులకు వైవిధ్యమైన, వాస్తవికమైన కథలను అందించడమే మా లక్ష్యం. ఎమ్ఎక్స్ ప్లేయర్ భారీ ఒరిజినల్ కంటెంట్, విశాలమైన యూజర్ బేస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోతో కలవడం మా కలెక్టివ్ ఆఫరింగ్‌ను మరింత బలోపేతం చేస్తుంది" అని పేర్కొన్నారు.
ఎమ్ఎక్స్ ప్లేయర్ ప్రస్థానం.. చిన్న యాప్ నుంచి దిగ్గజం దాకా
ప్రారంభంలో ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ కేవలం ఒక వీడియో ప్లేయర్ యాప్‌గా మాత్రమే ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా మైక్రో డ్రామాలు, ఉచిత ఓటీటీ రిలీజ్ కంటెంట్ సర్వీసులతో దూసుకెళ్లింది. ముఖ్యంగా యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన 'ఆశ్రమ్', 'భౌకాల్', 'రసభరి' వంటి ఒరిజినల్ ఓటీటీ సిరీస్‌లతో ఈ ప్లాట్‌ఫామ్ భారీ క్రేజ్ సంపాదించుకుంది.
2024లో ఎమ్ఎక్స్ ప్లేయల్ ఆస్తులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసి అమెజాన్ మినీ టీవీ (miniTV)తో కలిపి 'అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్'ను సృష్టించింది. ఇప్పుడు ఆ ప్రయాణం ప్రైమ్ వీడియోతో విలీనం దిశగా తుది అంకానికి చేరుకుంది.
యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ విలీనం వల్ల సబ్‌స్క్రిప్షన్ ఆధారిత (SVOD), ప్రకటనలతో కూడిన ఉచిత (AVOD), అద్దె ప్రాతిపదికన చూసే (TVOD) కంటెంట్ అంతా ఒకే ప్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం: అడ్వర్టైజ్‌మెంట్స్ లేకుండా లేదా అడ్వర్టైజ్‌మెంట్లతో చూసే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఉచిత వినియోగదారుల కోసం: మినీ టీవీ లేదా ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో లభించే ఉచిత వినోదం ఇకపై ప్రైమ్ వీడియోలోనే ఒక ప్రత్యేక విభాగంగా లభిస్తుంది.
యాప్స్ పనితీరులో మార్పులు
వచ్చే కొన్ని నెలల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తి కానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఎమ్ఎక్స్ ప్లేయర్ యాప్ తన లోకల్ వీడియో ప్లేయర్ ఫీచర్లను కొనసాగిస్తూనే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.
అయితే ఐఓఎస్ (iOS), వెబ్, స్మార్ట్ టీవీ యూజర్లు మాత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌కే రీడైరెక్ట్ అవుతారు. ఈ విప్లవాత్మక మార్పుతో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి పోటీ ఓటీటీ సంస్థలకు అమెజాన్ ప్రైమ్ సవాల్ విసిరినట్లయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


