OTT Crime: ఓటీటీ ట్రెండింగ్‌లో డార్క్ క్రైమ్ థ్రిల్లర్- నిద్రలేమితో బాధపడే పోలీస్-ఫిలిం ఫెస్టివల్‌లో 7 నిమిషాల చప్పట్లు!
Kennedy OTT Trending: ఓటీటీలో డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కెనెడీ దూసుకుపోతోంది. సన్నీ లియోన్ కీలక పాత్ర పోషించిన కెనెడీ ఓటీటీ ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో 7 నిమిషాల పాటు చప్పట్లు కొట్టించుకున్న కెనెడీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Kennedy OTT Streaming And Trending: కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఏడు నిమిషాల పాటు కరతాళ ధ్వనులు అందుకున్న అనురాగ్ కశ్యప్ డార్క్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కెన్నడీ నేరుగా ఓటీటీ రిలీజ్ అయి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ పొందినప్పటికీ, థియేటర్లలో విడుదల కాలేదు.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్
దీంతో ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరీక్షణను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కెనెడీ మూవీని ఓటీటీ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కెనెడీ సినిమా టీజర్‌ను పోస్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ భావోద్వేగానికి గురయ్యారు.
జీ5 ఓటీటీ వేదికగా
"ప్రపంచమంతా చుట్టి వచ్చిన మా ప్రేమ కానుక 'కెనెడీ' ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వస్తోంది. జీ5 (ZEE5) వేదికగా కెనెడీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏ సమయంలో ఏది జరగాలో అది అప్పుడే జరుగుతుంది. ఈ సినిమాను రూపొందించే అవకాశం కల్పించిన నా టీమ్, నిర్మాతలు, స్టూడియోకి ధన్యవాదాలు" అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
కాన్ వేదికపై ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్
2023లో జరిగిన కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో 'మిడ్ నైట్ స్క్రీనింగ్' విభాగంలో కెనెడీ సినిమాను ప్రదర్శించారు. ప్రదర్శన ముగిసిన తర్వాత అక్కడి ప్రేక్షకులు ఏకధాటిగా ఏడు నిమిషాల పాటు చప్పట్లతో నీరాజనం పట్టారు. ఆ తర్వాత సిడ్నీ, స్విట్జర్లాండ్, మెల్ బోర్న్, లండన్ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.
అసలు కథేంటి? ఎవరు నటించారు?
సాధారణంగా మన దగ్గర ఇలాంటి 'కల్ట్' సినిమాలకు థియేటర్లలో ఆదరణ లభిస్తుందో లేదో అన్న సందేహంతో మేకర్స్ డైరెక్ట్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతుంటారు. 'కెనెడీ' ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్. నిద్రలేమి సమస్యతో (Insomnia) బాధపడుతూ, చనిపోయాడని అందరూ భావించే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ కథ ఇది.
ప్రాయిశ్చిత్తం కోసం
అవినీతి కూరుకుపోయిన వ్యవస్థలో ఉంటూనే అతను చేసే రహస్య ఆపరేషన్లు, ప్రాయశ్చిత్తం కోసం అతను చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. రాహుల్ భట్ టైటిల్ రోల్ పోషించగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కీలక పాత్రలో నటించింది. జీ స్టూడియోస్ సమర్పణలో గుడ్ బ్యాడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20 నుంచి జీ5లో కెనెడీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ ట్రెండింగ్‌లో
అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఓటీటీలో కెనెడీ మంచి ఆదరణ అందుకుంటోంది. లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలకు ధీటుగా పోటీనిస్తూ కెనెడీ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సన్నీ లియోన్ నటించిన ఈ కెనెడీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


