OTT Weekend: ఓటీటీలో ఈ వీకెండ్ వినోదాల విందు.. మొత్తం 12.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ క్రేజీ సినిమాలు ఇవే!

OTT Weekend Watch Movies: ఓటీటీలోకి ఈ వీకెండ్‌కి చూసేలా సౌత్ భాషల్లో మొత్తం కలిపి 12 సినిమాలు క్రేజీగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, సన్ నెక్ట్స్ వంటి తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉన్న ఆ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: May 1, 2026, 20:01:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Weekend Watch Movies: సినిమా ప్రియులకు ఈ వీకెండ్‌‌కి ఓటీటీలో పండగే అని చెప్పాలి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన వైవిధ్యభరితమైన సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవి మొత్తంగా 12 ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.

ఓటీటీలో ఈ వీకెండ్ వినోదాల విందు.. మొత్తం 12.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ క్రేజీ సినిమాలు ఇవే!
ఓటీటీలో ఈ వీకెండ్ వినోదాల విందు.. మొత్తం 12.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ క్రేజీ సినిమాలు ఇవే!

ఓటీటీ తెరపై సందడి చేస్తున్న చిత్రాలు

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ వారం ఆసక్తికరమైన సినిమాలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా యువ నటుడు సతీష్ నటించిన 'ముస్తఫా ముస్తఫా' ఈ నెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ప్రముఖ టీవీ యాంకర్ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయితే, అతని కెరీర్, పెళ్లి ఎలా ఇబ్బందుల్లో పడ్డాయనే అంశాన్ని డార్క్ కామెడీగా ఈ చిత్రంలో చూపించారు.

అదేవిధంగా, నట్టి (సుబ్రమణ్యం) ప్రధాన పాత్రలో నటించిన 'TN 2026' కూడా ఏప్రిల్ 30న ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే ఎదురయ్యే సవాళ్లే ఈ చిత్ర ఇతివృత్తం. ఇక జీవీ ప్రకాష్ కుమార్ నటించిన 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

దీంతోపాటు తమిళ స్టార్ హీరో నివిన్ పౌలీ రాజకీయ నేపథ్యంగా వచ్చిన చిత్రం 'ప్రతిఛాయ'. ఈ సినిమా జియో హాట్‌స్టార్ ఓటీటీలో సందడి చేస్తోంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ప్రతి ఛాయ ఓటీటీ రిలీజ్ అయింది.

మలయాళం నుంచి విలక్షణమైన కథలు

మలయాళ సినిమాలు ఎప్పుడూ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఈ వారం '2BHK' అనే ఎమోషనల్ డ్రామా ఏప్రిల్ 28 నుంచే మనోరమ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గృహిణి, ఒక కళాకారుడి మధ్య సాగే సున్నితమైన బంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అలాగే, శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తెరకెక్కిన 'పారడైజ్' ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రశంసలు అందుకుంటోంది. ఇక సన్నీ వేన్ నటించిన 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్' చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. దేవుడు స్వయంగా భూమికి వచ్చి ఒక దర్శకుడితో కలిసి రోడ్ ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.

మలయాళం నుంచి మరో సినిమా ముండ్రోతురుతు ఒక సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కింది. మానవ సంబంధాలను, ఒంటరితనాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ముండ్రోతురుతు మనోరమ మ్యాక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

కన్నడ నుంచి వినూత్న ప్రయోగాలు

కన్నడ చిత్రం 'జెరాక్స్' (Jerax) జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక పాత జిరాక్స్ మిషన్‌కు మంత్రశక్తి తోడైతే, అందులో నుంచి వచ్చే కాపీలకు ప్రాణం వస్తే జరిగే పరిణామాలే ఈ సినిమా. వినడానికి వింతగా ఉన్నా, సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌గా ఇది ఆకట్టుకుంటోంది. మరోవైపు, విద్యార్థి దశ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి వెళ్లిన యువకుడి కథతో 'జేసీ ది యూనివర్సిటీ' సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

నేటి సోషల్ మీడియా యుగంలో డేటింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి? వాటి చుట్టూ అల్లుకున్న ఫేక్ రిలేషన్ షిప్స్ ఎలా ఉంటాయి? అనే అంశాన్ని 'నీ ఫరెవర్' సినిమాలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నీ ఫరెవర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

బ్యాండ్ మేళం ఓటీటీ

తెలుగులో వచ్చిన రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా బ్యాండ్ మేళం. చిన్ననాటి స్నేహితులైన గిరి, రాజీ ఒక చిన్న పొరపాటు వల్ల విడిపోతారు. రాజీ ఉన్నత చదువుల కోసం వెళ్లగా, గిరి తన ఊరిలోని బ్యాండ్ మేళంలో సంగీత విద్వాంసుడిగా స్థిరపడతాడు. విభిన్న మార్గాల్లో ప్రయాణించిన వీరిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అన్నదే ఈ సినిమా. ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ వీకెండ్ వినోదాల విందు

ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తంగా 12 క్రేజీ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ వీకెండ్‌కు మంచి వినోదం పంచనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More