Sreemukhi Fursat: ఫుడ్ బిజినెస్‌లోకి యాంకర్ శ్రీముఖి ఎంట్రీ- ఫుర్సత్ రెస్టారెంట్ ప్రారంభించిన బుల్లితెర బ్యూటీ!
Anchor Sreemukhi Launches Fursat Restaurant: ప్రముఖ బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి కొత్తగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఫుర్సత్ పేరుతో మాదాపూర్‌లో రెస్టారెంట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. సుమారు 300 మంది కూర్చుకునే కెపాసిటీతో ఈ రెస్టారెంట్ ఉంటుందని శ్రీముఖి తెలిపింది.
పాపులర్ యాంకర్, బుల్లితెర బ్యూటి శ్రీముఖి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఫుర్సత్ అనే పేరుతో చాలా గ్రాండ్‌గా రెస్టారెంట్‌ను ప్రారంభించింది టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి. మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్ వద్ద ఈ ఫుర్సత్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు.

మరో ముగ్గురు పార్టనర్స్‌తో ప్రారంభం
ఫుర్సత్ రెస్టారెంట్‌ను తన పార్ట్‌నర్స్ శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి శ్రీముఖి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, మీడియా ప్రతినిధులు, ఆహ్వానితులు హాజరై, మల్టీ-కుయిజిన్ వంటకాలతో పాటు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కలిపిన ప్రత్యేక డైనింగ్ కాన్సెప్ట్‌ను ఆస్వాదించారు.
ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం
ఫుర్సత్ రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. "నాకు భోజనం చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం. అలాగే వెజిటేరియన్ వంటకాలు కూడా నేను ఇష్టపడతాను" అని తెలిపింది.
రెస్టారెంట్ మాత్రమే కాదు
"ఫుర్సత్ రెస్టారెంట్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇది ఒక అనుభూతి, ఒక వాతావరణం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ప్రదేశం" అని శ్రీముఖి పేర్కొంది.
300 మంది కూర్చొనే సదుపాయం
"అందుబాటులో ధరలు, నల్లి గోష్ట్ బిర్యానీ వంటి ప్రత్యేక వంటకాలు, 300 మంది కూర్చునే సదుపాయంతో పాటు బ్యాంక్వెట్ సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల, హైదరాబాద్‌లో మంచి ఆహారం, వేడుకల కోసం ఒకే చోటుగా ఫుర్సత్ నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని యాంకర్ శ్రీముఖి వెల్లడించారు.
పార్టనర్ శ్రావణ్ కామెంట్స్
ఈ సందర్భంగా భాగస్వామి శ్రావణ్ మాట్లాడుతూ.. "ఫుర్సత్‌ను ప్రజలు ప్రశాంతంగా గడిపే, మంచి ఆహారంతో సమయాన్ని ఆస్వాదించే ప్రదేశంగా మేము ఆలోచించాం. రుచి, సేవలో నిరంతరతతో పాటు ఆత్మీయ వాతావరణాన్ని అందించడం మా లక్ష్యం. శ్రీముఖి ఉత్సాహం, మా అందరి అభిరుచితో, ఫుర్సత్ హైదరాబాద్‌లో కుటుంబాలు, స్నేహితులు, కార్పొరేట్ సమావేశాల కోసం ప్రాధాన్య ప్రదేశంగా మారుతుందని విశ్వసిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఆధునిక శైలిలో సంప్రదాయ రుచులు
ఆనంద్ రెస్టారెంట్ వంటకాల దృక్పథాన్ని వివరిస్తూ.. “ఫుర్సత్‌లో మేము వివిధ రుచులను దృష్టిలో ఉంచుకుని మెనూను రూపొందించాము. సంప్రదాయ రుచులను ఆధునిక శైలిలో అందిస్తూ, ప్రతి వంటకం నాణ్యత, నిజమైన రుచిని కాపాడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మా అతిథులకు కేవలం భోజనం కాకుండా పూర్తి డైనింగ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం” అని చెప్పారు.
అన్ని రకాల ఈవెంట్స్ కోసం
రెస్టారెంట్ కాన్సెప్ట్, భవిష్యత్ ప్రణాళికలను రవి వివరించుతూ.. “ఫుర్సత్‌ను మేము కేవలం రెస్టారెంట్‌గా కాకుండా, వేడుకలు, సమావేశాలు, గుర్తుండిపోయే క్షణాల కోసం ఒక ప్రత్యేక స్థలంగా రూపొందించాము. పెద్ద సంఖ్యలో కూర్చునే సౌకర్యం, బ్యాంక్వెట్ సదుపాయాలతో అన్ని రకాల ఈవెంట్స్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే నాణ్యతను కొనసాగిస్తూ ఫుర్సత్ బ్రాండ్‌ను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


