OTT Movies: ఓటీటీలో ఈ వారం చూసేందుకు 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒకేదాంట్లో 6, ఆ ఒక్కరోజే 5- తెలుగులో 2 స్పెషల్!
OTT Releases This Week: ఏప్రిల్ చివరి వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు భారీ కంటెంట్ విడుదలకు సిద్ధంగా ఉంది. శర్వానంద్ బైకర్ నుంచి రాకాస వరకు మిస్ అవ్వకూడని 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.
OTT Movies This Week: వేసవి సెలవుల వేళ థియేటర్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ మధ్యలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న వాటిలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న 10 సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

శర్వానంద్ బైకర్ (నెట్‌ఫ్లిక్స్ - మే 1)
హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన బైకర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1న ఓటీటీ రిలీజ్ అవనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, తండ్రి కలను నెరవేర్చి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను గర్వపడేలా చేసే ఒక రేసర్ కథ. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. రేసింగ్ ప్రియులకు ఇది పక్కా విజువల్ ట్రీట్.
సంగీత్ శోభన్ రాకాస ఓటీటీ
తెలుగులో సూపర్ హిట్ అయిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఓ బ్రహ్మరాక్షసుడిని అంతం చేసేందుకు యువకుడి చుట్టూ జరిగే కథ ఇది.
లారెన్స్ ఆఫ్ పంజాబ్ (జీ5)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఓటీటీ సిరీస్ 'లారెన్స్ ఆఫ్ పంజాబ్'. పంజాబ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా మొదలై, జైలు నుంచే 700 మందికి పైగా సభ్యులతో గ్లోబల్ క్రైమ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న గ్యాంగ్ బాస్‌గా అతడు ఎలా ఎదిగాడనేది ఇందులో చూపించనున్నారు. జీ5లో లారెన్స్ ఆఫ్ పంజాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ఉత్కంఠ రేపే అంతర్జాతీయ కంటెంట్
స్ట్రెయిట్ టు హెల్ (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 27): జపాన్ సోదెగత్తె కజుకో హోసోకి జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. పేదరికం నుంచి టీవీ సెలబ్రిటీగా ఎదిగిన ఆమె ప్రయాణంలోని వివాదాలు, అండర్‌వరల్డ్ లింకుల చుట్టూ ఈ డ్రామా సాగుతుంది.
మ్యాన్ ఆన్ ఫైర్ (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 30): ఏజే క్విన్నెల్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఓటీటీ సిరీస్, ఒక మాజీ సైనికుడి ప్రతీకార గాథ. యాహ్యా అబ్దుల్-మతీన్ II ప్రధాన పాత్రలో నటించారు.
షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్? (నెట్‌ఫ్లిక్స్ - ఏప్రిల్ 29): ఒక హత్య కేసులో ప్రధాన సాక్షిగా మారిన కాబోయే భార్య కథ ఇది. తన కాబోయే భర్త హంతకుడని తెలిసి అతడికి వ్యతిరేకంగా ఆమె సాక్ష్యాలను ఎలా సేకరించిందో చూపించే థ్రిల్లింగ్ డాక్యుమెంటరీ.
విడోస్ బే (ఆపిల్ టీవీ+ - ఏప్రిల్ 29): ఒక వింత ద్వీపం చుట్టూ అల్లుకున్న ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్. వైఫై, సిగ్నల్ కూడా లేని ఆ ఊరిని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలనుకున్న మేయర్ ఎలాంటి గండాలను ఎదుర్కొన్నాడో ఇందులో చూడొచ్చు.
రీజనల్ అండ్ ఇండియన్ ఒరిజినల్స్
హిందీలో సూపర్ హిట్ అయిన 'ఉందెఖి' సీజన్ 4 మే 1 నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అత్వాల్ కుటుంబంలోని అధికార పోరాటం ఈ సీజన్‌లో పతాక స్థాయికి చేరనుంది.
అలాగే హర్యానా బాక్సింగ్ నేపథ్యంలో దివ్యేందు, పుల్కిత్ సామ్రాట్ నటించిన 'గ్లోరీ' కూడా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఒక్కదాంట్లోనే 6
మలయాళీ స్టార్ జయసూర్య నటించిన ఫాంటసీ కామెడీ 'ఆడు 3' కూడా అదే రోజు అంటే మే 1 నుంచి జీ5 ఓటీటీలో సందడి చేయనుంది. ఇలా ఈ వారం చూసేందుకు 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రానుండగా.. వాటిలో ఏకంగా 6 ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, ఒక్క మే 1 రోజున 5 మూవీస్, స్పెషల్‌గా 2 తెలుగులో ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


