OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన రాకాస, బైకర్, కార్మేని సెల్వం- ఒకేదాంట్లో 2 స్ట్రీమింగ్- 7కిపైగా రేటింగ్- ఎక్కడంటే?
OTT Release Movies Latest: ఓటీటీలోకి నిన్న రిలీజ్ అయిన రాకాస, బైకర్, కార్మేని సెల్వం మూడు సినిమాల స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వీటిలో 2 సినిమాలు ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటికి 7కిపైగా రేటింగ్ ఉంది. మరి రాకాస, బైకర్, కార్మేని సెల్వం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అలా, నిన్న అంటే ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన మూడు సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి నెలకొంది. వాటిలో రెండు సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ కానున్నాయి. అలాగే, వాటికి 7కిపైగా ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉండటం విశేషం. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

రాకాస ఓటీటీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్ సోలో హీరోగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసిన సినిమా ఇది. ఓటీటీ సిరీసులకు దర్శకత్వం వహించిన మానస శర్మ రాకాస చిత్రాన్ని తెరకెక్కించారు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న రాకాస ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.
రాకాస సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7 రేటింగ్ కూడా ఉంది. కడుపుబ్బా నవ్వించే కామెడీతో, ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాకాస సినిమాను తెరకెక్కించినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంది.
రాకాస ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మంచి ధర వెచ్చించే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఈ డీల్ కుదుర్చుకుందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే రాకాస ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. అంటే, ఏప్రిల్ చివరి వారం, లేదా మే మొదటి 2 వారాల్లో రాకాస ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
బైకర్ ఓటీటీ
నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీనే బైకర్. మోటోక్రాస్ రేసింగ్ అనే కొత్త స్పోర్ట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన బైకర్ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.
తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎమోషన్స్, డ్రామా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. ఫలితంగా ఐఎమ్‌డీబీలో బైకర్ సినిమాకు 10కి 7.7 రేటింగ్ వచ్చింది.
దీంతో బైకర్ ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బైకర్ ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో బైకర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరో నాలుగు వారాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో బైకర్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇలా 7కిపైగా రేటింగ్ సాధించిన రెండు సినిమాలు ఒక నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి.
కార్మేని సెల్వం ఓటీటీ
ప్రముఖ నటుడు సముద్రఖని మెయిన్ లీడ్ రోల్‌లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా కార్మేని సెల్వం. రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా నిన్న (ఏప్రిల్ 3) థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. మధ్య తరగతి వ్యక్తుల ఆలోచన, అప్పుల వంటి విషయాలతో హృద్యంగా తెరకెక్కించారు.
ఇలాంటి కార్మేని సెల్వం ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. అంటే, థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత సన్ నెక్ట్స్‌లో కార్మేని సెల్వం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












