OTT Today: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన సంక్రాంతి ఫస్ట్ తెలుగు మూవీ.. శర్వానంద్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్.. మూడు వారాల్లోనే

2026 సంక్రాంతికి రిలీజైన సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇందులో ఫస్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు సినిమా నారీ నారీ నడుమ మురారీ. శర్వానంద్ హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది. 

Published on: Feb 4, 2026, 05:39:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన తెలుగు సినిమాల సందడి ఇక ఓటీటీలో షురూ అయింది. ముందుగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఫిబ్రవరి 4) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

నారీ నారీ నడుమ మురారి మూవీ పోస్టర్ (x/sarigamacinemas)
నారీ నారీ నడుమ మురారి మూవీ పోస్టర్ (x/sarigamacinemas)

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ

ఇద్దరు భామల మధ్యలో నలిగిపోయే బాయ్ ఫ్రెండ్ కథతో తెరకెక్కిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది.

మూడు వారాల్లోనే

సంక్రాంతి 2026 బక్సాఫీస్ రేసులో లాస్ట్ గా రిలీజైన మూవీ నారీ నారీ నడుమ మురారి. ఇది జనవరి 14న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ ఓటీటీలోకి మాత్రం మిగతా తెలుగు సంక్రాంతి 2026 సినిమాల కంటే ముందుగానే వచ్చేసింది. మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాకు రామ్ అబ్బరాజు డైరెక్టర్.

బ్లాక్ బస్టర్

శర్వానంద్ కు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత నారీ నారీ నడుమ మురారి మూవీతో అతను హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఫ్యామిలీతో మూవీ చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

నారీ నారీ నడుమ మురారి స్టోరీ

బీటెక్ తర్వాత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తాడు గౌతమ్ (శర్వానంద్). తను పని చేసే కంపెనీలో సివిల్ ఇంజనీర్ నిత్య (సాక్షి వైద్య)ను ప్రేమిస్తాడు. ఇద్దరు కలిసి తమ ప్రేమను ఇంట్లోవాళ్లకు చెప్పి, ఒప్పిస్తారు. అతి కష్టం మీద ఓ కండిషన్‌తో నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) ఒప్పుకుంటాడు.

ప్రేమించిన అమ్మాయితో గౌతమ్ పెళ్లి జరుగుతుండగా.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ దియా (సంయుక్త మీనన్) వచ్చి అడ్డుపడుతుంది. అలా గౌతమ్ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి.

ఆ తర్వాత ఏమైంది? అసలు గౌతమ్ పెళ్లికి దియా ఎందుకు అడ్డు పడింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (వీకే నరేష్) లేటు వయసులో పల్లవి (సిరి హనుమంత్)ని పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటీ? గౌతమ్ దియాకు ఎందుకు బ్రేకప్ అయింది? రామలింగం పెట్టిన కండిషన్ ఏంటీ? చివరికి నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More