OTT: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ధురంధ‌ర్‌- ఇది చెడు సినిమా- విద్వేషం, హింస డీఎన్ఏలోనే ఉంద‌ని లేడీ డైరెక్టర్ ఫైర్

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. కానీ ఇది చెడు సినిమా అని.. విద్వేషం, హింస దీని డీఎన్ఏలోనే ఉందని లేడీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Published on: Feb 1, 2026, 14:10:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్.. 2025 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ గా మారింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది. ఇండియా నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ పై లేడీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ఫైర్ అవడం హాట్ టాపిక్ గా మారింది.

ధురంధర్ పై లేడీ డైరెక్టర్ ఫైర్
ధురంధర్ పై లేడీ డైరెక్టర్ ఫైర్

ధురంధర్ పై ఫైర్

ధడక్ 2 మూవీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ధురంధర్ మూవీపై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం (ఫిబ్రవరి 1) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ చిత్రాన్ని విమర్శించారు.

ధురంధర్ టైటిల్ ట్రాక్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా సెట్ చేసిన షాజియా.. "ఎంత చెడు సినిమా! ఈ మూవీ దాక్కోలేదు. అలాగే ఇది అనుకోకుండా తీసింది కాదు. విద్వేషాన్ని ప్రేరేపించడం, హింస ఈ సినిమా డీఎన్ఏలోనే ఉంది’’ అని షాజియా ఫైర్ అయ్యారు.

షాజియా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ
షాజియా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ

మైనారిటీల పట్ల

మైనారిటీ వర్గాలపై ధురంధర్ లాంటి సినిమాల ప్రభావం పట్ల ఇండస్ట్రీలో ఉదాసీనత ఉందని ముస్లిం డైరెక్టర్ అయిన షాజియా ఇక్బాల్ ఆరోపించారు. "కానీ ఇది చాలా బాగా తీర్చిదిద్దిన సినిమా. బీజీఎం కూల్ గా ఉంది. ఇండస్ట్రీ డ్యూడ్ బ్రోస్ వెల్ డన్. మీలో చాలా మంది మైనారిటీల గురించి పట్టించుకోకపోవడం అనే ఉదాసీనతను దాచినందుకు సంతోషంగా ఉంది "అని ఆమె వెటకారంగా మరో స్టోరీలో పోస్టు చేశారు.

షాజియా స్టోరీ
షాజియా స్టోరీ

ధురంధర్ ఓటీటీ

బాక్సాషీస్ దగ్గర సంచలన ప్రదర్శన తర్వాత రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీలోకి వచ్చింది. జనవరి 30 నుంచి ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలోనే నంబర్ వన్ ఓటీటీ మూవీగా ధురంధర్ ట్రెండింగ్ లో ఉందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇది ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.

ధురంధర్ గురించి

ధురంధర్ మూవీ ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ తదితరులు నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్ ధురంధర్ 2 మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More