OTT: మాటలు లేని సినిమా.. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఓ లుక్కేయండి
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’. ఇందులో అసలు డైలాగ్ లే ఉండవు. మాటలు లేని మూకీ మూవీ ఇది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.
ఈ రోజుల్లో మాటలు లేని సినిమా తీయడం రిస్క్. కానీ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి స్టార్ నటులతో మేకర్స్ ఆ రిస్క్ చేశారు. ఎలాంటి డైలాగ్ లు లేని మూకీ సినిమాగా ‘గాంధీ టాక్స్’ను తెరకెక్కించారు. జనవరి 30న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో గాంధీ టాక్స్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.

గాంధీ టాక్స్ ఓటీటీ
ఇటీవల థియేటర్లలో విడుదలైన లేటెస్ట్ సైలెంట్ కామెడీ డ్రామా 'గాంధీ టాక్స్'. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఏ ఓటీటీలోకి సినిమా వస్తుందనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం గాంధీ టాక్స్ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.
ఓటీటీ రిలీజ్
'గాంధీ టాక్స్' సినిమా జీ5లో తన ఓటీటీ డెబ్యూ చేయడం ఖాయమైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే జీ5తో ఓటీటీ డీల్ జరిగింది. ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది గాంధీ టాక్స్. మరి ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న రావడం సహజమే. సాధారణంగా తమిళ సినిమాలు నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు గాంధీ టాక్స్ కూడా ఇదే పద్ధతిలో ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
గాంధీ టాక్స్ గురించి
'గాంధీ టాక్స్' ఒక సైలెంట్ సినిమా. డైలాగ్ లు లేకుండా తెరకెక్కిన అరుదైన మూవీ ఇది. ఇది మనీ అవసరమైన ఈ నిరుద్యోగి చుట్టూ సాగుతోంది. అతను అప్పటికే నష్టాల్లో ఉన్న ఓ బిజినెస్ మ్యాన్ ను దోచుకుంటాడు.
కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ జాదవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బలం.
అక్కడ ప్రీమియర్
గాంధీ టాక్స్ 2023లో భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయింది. ఇది జనవరి 30, 2026న థియేటర్లలో విడుదలైంది. దీనికి జీ స్టూడియోస్, క్యూరియస్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీమిల్ సపోర్ట్ ఇచ్చాయి.
గాంధీ టాక్స్ మూవీని సైలెంట్ గా తీయడంపై డైరెక్టర్ కిశోర్ మాట్లాడుతూ.. ‘‘డబ్బు, అధికారంలో చాలా శబ్దం ఉంది కాబట్టే ఈ సినిమా సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నిజం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. కథలో మేము చాలా నిజాయితీగల పాత్రలను సృష్టించాం. వాళ్లు సత్య మార్గంలో నడుస్తారు. అందుకే సినిమా సైలెంట్" అని అన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


