Raakaasa: హారర్ కామెడీ ఫాంటసీ రాకాసకు పాజిటివ్ టాక్.. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, నయన్, మానస శర్మ ఏం చెప్పారంటే?

Raakaasa Success Meet Event Niharika Sangeeth Nayan Manasa Speech: నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్‌గా నటించిన రాకాస సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిహారిక, సంగీత్, నయన్, మానస కామెంట్స్ తెలుసుకుందాం.

Published on: Apr 4, 2026, 11:19:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు.

హారర్ కామెడీ ఫాంటసీ రాకాసకు పాజిటివ్ టాక్.. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, నయన్, మానస శర్మ ఏం చెప్పారంటే?
హారర్ కామెడీ ఫాంటసీ రాకాసకు పాజిటివ్ టాక్.. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, నయన్, మానస శర్మ ఏం చెప్పారంటే?

పాజిటివ్ టాక్

సంగీత్ శోభన్ సోలో హీరోగా తెరకెక్కిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది. రాకాస సినిమాకు విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో సినిమా విడుదలైన శుక్రవారం (ఏప్రిల్ 3) నాడు చిత్ర యూనిట్ రాకాస బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది" అని అన్నారు.

సంగీత్ శోభన్ కామెంట్స్

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "‘రాకాస’కి ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. పిల్లలతో సహా పేరెంట్స్ ఈ మూవీకి వస్తున్నారు. పిల్లలు ఈ చిత్రాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా కూడా మా సినిమాని చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. మా మూవీని ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని చెప్పాడు.

"‘రాకాస’ రెస్పాన్స్ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నా ఫ్యామిలీ. ప్రీమియర్ల నుంచే మాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. అన్ని వర్గాల ఆడియెన్స్ మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సక్సెస్ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది" అని హీరోయిన్ నయన్ సారిక పేర్కొంది.

మానస శర్మ స్పీచ్

డైరెక్టర్ మానస శర్మ మాట్లాడుతూ .. "‘రాకాస’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చందమామ లాంటి కథ అని మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అదే విషయాన్ని ప్రేక్షకుల వరకు మీడియా రీచ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందమేస్తోంది" అని తెలిపారు.

"చాలా చోట్ల ఆడియెన్స్ పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమా ఆస్వాదిస్తూ చూస్తుంటే సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను" అని దర్శకురాలు మానస శర్మ ఆకాంక్షించారు.

ఫ్యామిలీతో చూడండి

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "‘రాకాస’ అందరికీ నచ్చుతోంది. ఆడియెన్స్ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు? అని మేం అనుకున్నామో.. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ఫ్యామిలీతో కలిసి మా చిత్రాన్ని చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే, జీ స్టూడియో కంటెంట్ హెడ్ దివ్య మాట్లాడుతూ .. "‘రాకాస’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్‌కి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More