క్రూజ్ షిప్‌లో అందాల భామలు.. నయన్, త్రిష స్టన్నింగ్ ఫొటోలు వైరల్.. ఏఐ అనుకున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్

నయనతార, త్రిష కలిసి క్రూజ్ షిప్ లో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లో సన్ సెట్ అవుతుండగా.. వీళ్ల అందం మరింత పెరిగినట్లుగా కనిపించింది.

Jan 19, 2026, 21:10:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలుగా పేరుగాంచిన నయనతార (Nayanthara), త్రిష (Trisha) తమ అభిమానులకు సోమవారం (జనవరి 19) ఒక బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి సముద్రం మధ్యలో క్రూజ్ షిప్‌పై ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెనుక సూర్యాస్తమయం, చల్లని సముద్రపు గాలి మధ్య.. నలుపు రంగు దుస్తులు, కూలింగ్ గ్లాసెస్ ధరించి వీరిద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

క్రూజ్ షిప్‌లో అందాల భామలు.. నయన్, త్రిష స్టన్నింగ్ ఫొటోలు వైరల్.. ఏఐ అనుకున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
క్రూజ్ షిప్‌లో అందాల భామలు.. నయన్, త్రిష స్టన్నింగ్ ఫొటోలు వైరల్.. ఏఐ అనుకున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్

‘త్రిష లేకపోతే నయనతార’ రియల్ అయ్యింది

ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు టాప్ హీరోయిన్లు అయిన నయనతార, త్రిష ఇలా కలిసి కనిపించడం చాలా అరుదు కావడంతో.. కొందరు ఇది నిజమా లేక ఏఐ (AI) క్రియేషనా అని అనుమానం వ్యక్తం చేశారు. "నయన్ అకౌంట్ చూశాకే ఇది నిజమని తెలిసింది" అని ఒకరు.. "ఫైనల్లీ.. త్రిష లేకపోతే నయనతార నిజమైంది" అని మరొకరు కామెంట్ చేశారు. 2015లో వచ్చిన జీవీ ప్రకాష్ కుమార్ సినిమా ‘త్రిష ఇల్లన నయనతార’ టైటిల్‌ను ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

కెరీర్ పరంగా బిజీ బిజీ..

నయనతార ఈమధ్యే చిరంజీవితో కలిసి నటించిన మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తొలి వారంలోనే రూ.292 గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే కాకుండా నయన్.. ఇటీవలే మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి నటించిన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ ‘టెస్ట్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘డియర్ స్టూడెంట్స్’, ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2), యష్‌తో ‘టాక్సిక్’ (Toxic) వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇక త్రిష విషయానికి వస్తే ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించింది. అంతకుముందు అజిత్ ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ‘బృంద’లో నటించింది. త్వరలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోనూ త్రిష కీలక పాత్రలో కనిపించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More