Heroine: ఆ హీరోయిన్ డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తారు- బడ్జెట్‌లోనే తీయాలనుకున్నాం, కానీ: డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్

Director Manasa Sharma About Nayan Sarika And Raakaasa: ఓటీటీ సిరీస్‌లతో మంచి ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ రాకాస. ఈ సినిమాలో సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా విశేషాలను రీసెంట్‌గా మానస శర్మ తెలిపారు.

Published on: Mar 26, 2026, 13:52:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు వెండితెరపై ఫీచర్ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇస్తున్న ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ. ఆమె తెరకెక్కించిన తొలి సినిమా రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. అనుదీప్ సంగీతం అందించారు.

ఆ హీరోయిన్ డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తారు- బడ్జెట్‌లోనే తీయాలనుకున్నాం, కానీ: డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్
ఆ హీరోయిన్ డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తారు- బడ్జెట్‌లోనే తీయాలనుకున్నాం, కానీ: డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్

రాకాస ట్రైలర్ విడుదల

రాకాస సినిమాలో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశాడు. సంగీత్ శోభన్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నయన్ సారిక యాక్ట్ చేసింది. గెటప్ శ్రీను కీలక పాత్ర పోషించాడు. ఏప్రిల్ 3న రాకాస సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రాకాస ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

రాకాస ట్రైలర్ తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాకాస డైరెక్టర్ మానస శర్మ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నయన్ సారిక గురించి, రాకాస బడ్జెట్‌, తదిదర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మానస శర్మ.

నయన్ సారిక గురించి చెప్పండి?

మానస శర్మ : నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.

బడ్జెట్ పెరిగిందని అంటున్నారు? దాని గురించి చెప్పండి?

మానస శర్మ : ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.

‘రాకాస’లో కొత్తగా ఏం ఉండబోతోంది?

మానస శర్మ : ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.

వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యం కాలేదా?

మానస శర్మ : ‘రాకాస’ సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది.

అనుదీప్ గారి మ్యూజిక్ గురించి చెప్పండి?

మానస శర్మ : నిహారిక గారు అనుదీప్ గారిని సజెస్ట్ చేశారు. అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్ఆర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం.

నిర్మాత నిహారిక గారి గురించి చెప్పండి?

మానస శర్మ : నిహారిక గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక గారు మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.

ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?

మానస శర్మ : ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తరువాత వాటి గురించి చెబుతాను.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More